కోడెలకు సన్ స్ట్రోక్ తప్పదేమో... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోడెలకు సన్ స్ట్రోక్ తప్పదేమో...

గుంటూరు, జూలై 15, (way2newstv.com)
పుత్ర రత్నాలు ఇంతటి ఉపద్రవం తెచ్చి పరువు తీస్తారనుకోలేదు పెద్దాయన. కోడెల శివప్రసాద్ మంత్రిగా, స్పీకర్ గా ఎమ్యెల్యేగా వెలగబెట్టిన వైభోగం అంతా ఇంతా కాదు. తన కుమారుడు, కుమార్తె తుస్సుమనిపిస్తారని కలలో కూడా అయన ఊహించలేదు. ఒకప్పుడు తమ ఇంటిముందు సమస్యలు తీర్చండి మహాప్రభో అన్న వారే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అదే స్థాయిలో జనం ఇంటిముందు వాలుతున్నారు. అయితే వారంతా తమ కుమారుడు, కుమార్తె చేసిన అక్రమాల చిట్టా విప్పుతు ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు. ఒక పక్క పార్టీ ఘోర పరాభవం మరోపక్క తన ఓటమి వెరసి పుత్ర రత్నాలు తెచ్చిపెట్టిన సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆయన. తాజాగా తమ కుమారుడికి కలెక్టరేట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏడు లక్షలు మింగి చెయ్యిచారంటూ కోడెల ఇంటిముందే ఆందోళలన మొదలు పెట్టిందో కుటుంబం. 
కోడెలకు సన్ స్ట్రోక్ తప్పదేమో...

ఇలా రోజుకో వివాదం తన కుటుంబాన్ని చుట్టుముడుతూ ఉండటంతో దిక్కుతోచని స్థితిలో డాక్టర్ కోడెల ఉన్నట్లు సన్నిహితులంటున్నారు.కోడెల శివప్రసాద్ కుటుంబం ఇప్పుడు కోర్ట్ ల చుట్టూ తిరుగుతుంది. కేసుల మీద కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదు అవుతూ ఉండటంతో అరెస్ట్ తప్పించుకోవడానికి కోడెల కుమార్తె విజయలక్ష్మి హై కోర్ట్ ను ఆశ్రయించారు. తనపై వస్తున్న కేసులు రాజకీయ ప్రేరిపితం అయినందున వాటిని కొట్టి వేయాలని ఆమె న్యాయస్థానం ను అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ కేసును స్వీకరించిన కోర్ట్ విచారణ మొదలు పెట్టింది.కేసులో కోడెల కుటుంబానికి ముందస్తు బెయిల్ లభించి ఊరట దొరుకుతుందో లేదో చూడాలి. కానీ న్యాయస్థానం ఎన్ని కేసుల్లో ఇలా వారిని రక్షించగలదు రోజుకో బాధితుడు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కి దిగుతూ ఉంటే ఎవరు మాత్రం వారిని కాపాడతారు అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కోడెల రాజకీయ జీవితానికి కుమారుడు, కుమార్తె మాత్రం పెద్ద మచ్చే తెచ్చిపెట్టడంతో బాటు వారి రాజకీయ భవిష్యత్తుకు పాతర వేసుకుని తమ గొయ్యి తామే తవ్వుకున్నారనే టాక్ గుంటూరు జిల్లాలో గుప్పు మంటుంది.