ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టా


డెల్టా- పల్టా

విజయవాడ, జూలై 5 (way2newstv.com)
వర్షాభావ పరిస్థితులతో కృష్ణా డెల్టా రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నైరుతీ రుతుపవనాలు ముఖం చాటేయడంతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. కృష్ణా, గోదావరి నదుల్లో నీరు లేక పోవడం డెల్టా రైతుల పాలిట శాపంగా మారింది. ఏటా జూన్ రెండవ వారం నుంచి ప్రారంభించే వరి నాట్లు  జూలై నెల వచ్చినా పడలేదు. వర్షాలు పడక, కాల్వలనుంచి నీరు రాని  ఫలితంగా ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. కృష్ణా, గోదారమ్మ నీళ్లతో తీవ్ర వర్షాభావ సమయంలోనూ సిరులు పండించిన కృష్ణా డెల్టా పంట పొలాలు నీటిచుక్క కోసం తపించిపోతున్నాయి. ఖరీఫ్‌ సీజన్ ఆరంభమై నెల రోజులైనా కృష్ణా జిల్లాలో నేటికీ సాగు ముందుకు సాగని పరిస్థితి . కృష్ణమ్మ రాక కోసం కాల్వలు కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నాయి. .  గోదారమ్మ కోసం చెరువులు నోళ్లు తెరిచి చూస్తున్నాయి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ లో సాగు, తాగు నీటి అవసరాల కోసం 85 టీఎమ్సీ లు నీరు అవసరం ఉంటుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడని కారణంగా కృష్ణా నదిలోకి నీరు రావడం లేదు. 

ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టా

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు సైతం అడుగంటే పరిస్థితి రావడంతో అక్కడి నుంచి డెల్టాకు నీరు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. జూలై వచ్చినప్పటికీ వేసవిలా ఉంది తప్పితే వాతావరణం చల్లబడటం లేదు. ఇంకా ఎండలు మండుతున్నాయి. చూ ద్దామన్న ఎక్కడా చుక్క నీళ్లు లేవు. నీటి వనరులు అన్నీ పూర్తిగా ఎండిపోయి కనిపి స్తున్నాయి. కృష్ణానది కి వరద నీటిని తెచ్చే మునేరు, వైరా యేరు, పాలేరు, కట్లేరులలో కనీసం ఊట నీళ్లు కూడా లేవు. ఎత్తిపోతల పథకాలకు, కాల్వ లకు ఇప్పట్లో సాగునీరు అందే పరిస్థితి కనిపించటం లేదు. నాలుగేళ్లుగా కృష్ణానదికి ఖరీఫ్ సీజన్ లో తగిన సమయంలో నీరు రాక పోయినా పట్టి సీమ పంపుల ద్వారా నదిలోకి నీరు తెచ్చి కాల్వలకు నీరు అందించారు. జూన్ రెండవ వారానికల్లా పట్టి సీమ నీరు డెల్టా రైతులను ఆదుకుంది. ఈ ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాల్వ మోటార్లను ఆన్‌ చేసి 700 క్రూసెక్కుల గోదావరి నీళ్లను పోలవరం కాల్వలోకి వదిలినట్లే వదిలి ఆపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా జూన్‌ రెండవ  వారంలోనే పోలవరం కాల్వలోకి వచ్చే గోదారమ్మ ఈ సారి కరుణించలేదు. ప్రకాశం బ్యారేజికి కుడి వైపున వెస్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా గుంటూరు జిల్లాకు, ఈస్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జిల్లాకు కాల్వల ద్వారా సాగునీరు అందుతుంది.  కాల్వలోకి నీళ్లు రాకపోకవడంతో సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వారం క్రితం పోలవరం కాల్వలోకి నీటిని విడుదల చేయగా, గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంపులను ఆపేశారు. డెల్టాలో రేండు కాల్వల మీద ఆధారపడి 13 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోంది. ప్రస్తుతం కాల్వలు ఎండి పోవడం వల్ల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. జూలై నెల వచ్చినప్పటికీ కాలువలకు చుక్కనీరు కూడా రాలేదు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జులై మాసం వచ్చినా కనిష్ట స్థాయిలో కూడా కురవని వర్షాలు ఓ వైపు, లేని ప్రాంతీయతత్వాన్ని ఎగదోసి పట్టిసీమ నీటిని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వెరసి కృష్ణాడెల్టాలో చివరి ఆయకట్టు అయిన అవనిగడ్డ నియోజకవర్గంలో సాగును ప్రశ్నార్థకం చేశాయి. కానీ, సాగునీటి కొరత, తీవ్ర వర్షాభావం వెంటాడటంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. కరకట్ట దిగువల ఉన్న లంక గ్రామాలలో సైతం పంటలు లేక పొలాలు బీడు వారుతున్నాయివరుణ దేవుడు కరుణించడం లేదు. జూన్‌ నెలలో మొదలు కావాల్సిన తొలకరి జూలై వచ్చినప్పటికీ సాగడం లేదు. ఒకటి రెండు సార్లు కొద్దిపాటి చినుకులు తప్పితే భారీ వర్షాలు పత్తాలేవు. పొలాలు పదును కాలేదు. ఇంకా నెర్రెలిచ్చి ఉన్నాయి.  వచ్చిన కొద్ది పాటి వర్షం కారణంగా పంట పొలాల్లో పిచ్చి మొక్కలు రావడంతో పశువులకు దాణా గా మాత్రమే పొలాలు ఉపయోగపడుతున్నాయి.,  కొన్నిమెట్ట ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో జూన్‌ చివరి వారం నాటికే నారుమళ్లు పోసుకోవటం ఆనవాయితీ.. గత ఏడాది జూన్‌ రెండవ వారం నాటికే ఇరిగేషన్‌ అధికారులు పట్టిసీమ నీటిని విడుదల చేయటంతో ఆయా మండలాల్లో దాదాపుగా అన్ని చోట్లా నారుమళ్లు పోసుకోవటం తో పాటు వరి నాట్లు కూడా పూర్తయ్యేవి. ప్రస్తుతం అయితే కృష్ణా డెల్టాలో చిట్టచివరి ఆయకట్టు అయిన అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ ఏడాది సాగు సాగేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో మెట్ట, మాగాణి పంటలను సాగు చేస్తూ ఉండగా, ఎస్టేట్‌ మండలాలైన మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 40వేల ఎకరాలకు పైబడి సాగు జరుగుతోంది. ఇందులో అత్యధికం పంటకాల్వలపైనే ఆధారపడి సాగు జరుగుతూ ఉండగా మోపిదేవి, చల్లపల్లి, ఘంట సాల మండలాల్లోని కరకట్ట బయట ఉన్న మెట్ట భూముల్లో మాత్రం బోర్లు ద్వారా కొంతమేర సాగయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో పదిపదిహేను రోజుల్లోపు పంటకాల్వల ద్వారా నీరు విడుదల కాకుంటే డెల్టా రైతులకు సంకట స్థితి తప్పేటట్లు లేదు..  నాగాయలంక, కోడూరు, నేపథ్యంలో మరో పదిపదిహేను రోజుల్లోపు పంటకాల్వల ద్వారా నీరు విడుదల కాకుంటే ముతకలు సాగుచేసే ఎస్టేట్‌ మండలాల్లో గానీ, బీపీటీ సాగు చేసే దివి తీర మండలాల్లో గానీ సాగు సాగటం కష్టమవుతుందని రైతులు భావిస్తున్నారు.భారీ వర్షాలు పడితే పచ్చిరొట్టగా వినియోగించుకు నేందుకు తప్పితే ఇక తొలకరి పంటలు సాగు చేయటం చాలా కష్టం. ఈ పంట లపై ఆశలు వదు లుకున్నట్లే. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర మంతటా విస్తరిం చాయని, మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతా వరణ శాఖ అధికారులు చెప్పడంతో వందలాది మంది రైతులు ఎంతో ఆశతో పొడి మట్టిలో పత్తి విత్తనాలు విత్తారు. పది రోజులైనప్పటికీ చినుకు పడలేదు. దీంతో విత్తనాలు మొల వలేదు. పొడి వాతావరణం వల్ల విత్తనా లను పురుగులు తినేసాయి. మరల పత్తి విత్తనాలు వేయాల్సి ఉంది. వ్యవసాయం, విత్తనాలు, కూలి సొమ్ముతో కలుపుకుని ఎకరానికి రెండు వేల రూపాయల వంతున రైతులు నష్టపోయారు. అటు తాగు నీటికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తు న్నది. రెండు మూడు రోజులకు కూడా నీళ్లు అందటం లేదు. ముఖ్యంగా కంచిక చర్ల పట్టణంలో పరిస్థితి ఇంకా దారు ణంగా ఉందినైరుతి ముఖం చాటేయడంతో రోజులకు కూడా నీళ్లు రావటం లేదు. పశువులు, జీవాల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొలాలు ఎండిపోయి ఉన్నా యి. పచ్చగడ్డి లేదు. మాగాణి భూములు, చివరకు చెరువుల్లో సైతం గడ్డి పరక దొరకడం లేదు. ఎక్కడా నీళ్లు దొరకక పోవటంతో పశువులు అల్లాడు తున్నాయి. ఏమైనా మెట్ట ప్రాం తంలో ముఖ్యంగా నందిగామ, జగ్గయ్య పేట నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  వరుణ దేవుడి కటాక్షం కోసం గ్రామాల్లో రైతులు, కూలీలు, గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.