కేంద్ర ప్రభుత్వం కొత్త టీవీ ఛానల్‌కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దూరదర్శన్‌లో స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్టార్టప్‌లకు ఇది నిజంగా ఊరట కలిగించే విషయమే. ఛానల్ నిర్వహణ బాధ్యతలు కూడా స్టార్టప్స్‌కే అప్పగిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
స్టార్టప్స్ కోసం డీడీ చానెల్
మరోవైపు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణాలు అందిస్తామని ప్రతిపాదించారు. అలాగే ఏంజెల్ ట్యాక్స్‌కు సంబంధించి రిక్విసైట్ డిక్లరేషన్ ఫైల్ చేసిన వారిపై ఎలాంటి విచారణ ఉండదని తెలిపారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. అందుకే ఈ బడ్జెట్‌పై అంచనాలు చాలానే ఉన్నాయి.
Tags:
all india news