క్యాష్ విత్ డ్రా చేస్తే బాదుడే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్యాష్ విత్ డ్రా చేస్తే బాదుడే


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. వరాలు కురిపిస్తుందని భావించిన ప్రజలకు ఇది ఝలక్ అనే చెప్పాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2019లో బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికి పైగా డబ్బు విత్‌డ్రా చేసుకుంటే ఇప్పుడు 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. 

క్యాష్ విత్ డ్రా చేస్తే బాదుడే

ఇది టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) రూపంలో కట్ అవుతుంది. వ్యాపార లావాదేవీలను నగదు రూపంలో ప్రోత్సహించకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాష్ విడ్‌డ్రాయెల్స్‌పై పన్ను ఉంటుందని పరిశ్రమ వర్గాలు ముందుగానే ఊహించాయి. ఇప్పుడు ఇదే నిజమైంది. ఇకపోతే నగదు ఉపసంహరణపై టీడీఎస్ కారణంగా డిజిటల్ లావాదేవీలు కూడా పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల ప్రోత్సహానికి ఎప్పటి నుంచో తగిన చర్యలు తీసుకుంటూ వస్తోంది