వరంగల్లు అర్బన్, జూలై 17,(way2newstv.com):
ఆధునిక సేద్య పద్ధతుల పట్ల రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో వర్ధెల్లి అన్నారావు పొలంలో సీడర్స్తో వరి విత్తనాలను వేస్తున్న ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ విత్తనంతో, సాధారణ పంటకాలం కంటే తక్కువ రోజులలో 15 నుండి 20 శాతం వరకు అధిక దిగుబడిని అందించే ఇటువంటి ప్రక్రియ పట్ల విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
అధునిక సేద్య పద్దతులపై అవగాహన
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సమిష్టిగా వినియోగించుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని తెలిపారు. ఆత్మ ద్వారా క్షేత్ర సందర్శన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. యూనిట్ విలువ రూ.5000 లు ఉన్న డ్రీమ్ సీడర్ కు వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిఢి ఇస్తుందని తెలిపారు. రైతుల డిమాండ్ అనుగుణంగా డ్రీమ్ సీడర్లు పంపీణీ చేసేందుకు నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ కమీషనర్ దృష్టికి తేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎ,డి కె.దామోదర్ రెడ్డి, ఎం.ఎ.ఓ.యం.రాజ్ కుమార్, తదితరలు పాల్గొన్నారు.
Tags:
telangananews