సికింద్రాబాద్ జూలై 17,(way2newstv.com):
ఈ నెల 21 న జరిగే మహంకాళి బోనాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. దీనిలో భాగంగా ఈరోజు 27 మంది సభ్యులతో దేవాలయ ఉత్సవ కమిటీ ని ఏర్పాటు చేసి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
బోనాలకు అన్ని ఏర్పాట్లు
దర్శనం కొరకు వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండగ గా గుర్తించి ప్రత్యేక నిధులు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. ప్రభుత్వ సహకారం తో బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
Tags:
telangananews