తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టు పిటిషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టు పిటిషన్

అమరావతి,  జూలై 12 (way2newstv.com)
తిరుమల తిరుపతిలో  అమలవుతున్న విఐపీ  బ్రేక్ దర్శనాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్ దాఖలయింది. ఎల్ 1, ఎల్ 2 ఎల్  ౩ దర్శనాలు ఏ ప్రాతిపదికన  విభజించారో తెలపాలని పిటిషనర్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర  కోర్ట్ లో వాదనలు వినిపించారు. విఐపీ  బ్రేక్ దర్శనానికి టీటీడీ చట్టం లోగాని, జీవో గాని, గైడెలెన్స్ ఉంటే కోర్ట్ ముందు పెట్టాలని కోరారు.  
తిరుమల విఐపీ దర్శనాలపై హైకోర్టు పిటిషన్

ఎల్ 1, ఎల్ 2 ఎల్  ౩  దర్శనాలు రద్దు చేయాలని కోర్టును కోరారు. దైవ ఆరాధన లో భక్తులు  అందరిని సమానంగా చూడాలని కోరారు. దైవరాదన హక్కు దేవాలయాల్లో అందరికి సమానంగా ఉంటుంది అంటూ  గతంలో సుప్రీం కోర్ట్ తీర్పు ఉందని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు పై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం తో పాటు టీటీడీ స్టాండింగ్ కమిటీ కి కోర్టు  ఆదేశించింది. విచారణను  వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.