సోమిరెడ్డి రేంజ్ డ్యామేజ్ ఓ రేంజ్ లో... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోమిరెడ్డి రేంజ్ డ్యామేజ్ ఓ రేంజ్ లో...


నెల్లూరు, జూలై 8, (way2newstv.com)
ల్లూరు. రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న జిల్లా ఇది. 2014లో ఇక్కడ కీల‌క మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ హ‌వా ఉన్నా టీడీపీ కీల‌క‌మైన వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి, కోవూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించింది. ఎన్నిక‌ల్లో ఓడినా సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియ‌ర్‌ను బాబు ఎమ్మెల్సీ చేసి మ‌రి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక నారాయ‌ణ‌కు కూడా ఎమ్మెల్సీతో మంత్రిని చేశారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయాల‌ని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి వ‌చ్చే నాయ‌కుల‌పై వ‌ల విసిరింది.ఈ క్రమంలోనే నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి వంటి వారిని పార్టీలో చేర్చుకుంది. అదేవిధంగా రాజ‌కీయాల‌కు ఎప్పుడో దూర‌మైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య వంటివారికి ఏడెనిమిది నెల‌ల‌కు ముందుగానే టికెట్‌ను కూడా క‌న్ఫర్మ్ చేశారు చంద్రబాబు. దీంతో జిల్లాలోని మొత్తం 10 స్థానాల‌ను టీడీపీ ఖాతాలో వేసుకోవ‌చ్చని భావించారు. 

సోమిరెడ్డి రేంజ్ డ్యామేజ్ ఓ రేంజ్ లో...

ఇక మంత్రులు సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి, నారాయ‌ణ నెల్లూరు నుంచి పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు.తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా ముందు నెల్లూరులో ఒక్క సీటును కూడా టీడీపీ త‌న ఖాతాలో వేసుకోలేక పోయింది. ముఖ్యంగా సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి సైతం ఓట‌మిపాల‌య్యారు. అదే స‌మ‌యంలో చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి నారాయ‌ణ కూడా ఓడిపోయారు. ఇక‌, ఏ ఒక్క స్థానం కూడా టీడీపీ ఖాతాలో ప‌డ‌క‌పోవ‌డంతో పార్టీలో తీవ్రమైన నిస్తేజ భ‌రిత వాతావ‌ర‌ణం ఏర్పడింది. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు మౌనం వ‌హించారు.ఈ ప‌రిణామాన్ని అస్సలు ఊహించ‌ని నాయ‌కులు త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోపార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాల‌నే విష‌యంపై ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓట‌మిపై స‌మీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇక్కడి ప‌రిస్తితి తెలిసి నిర్ఘాంత పోయారు. నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్టుగా ఉన్నార‌ని, పార్టీని ఏక‌తాటిపైకి న‌డిపించేందుకు ఎవ‌రూ క‌లిసి క‌ట్టుగా కృషి చేయ‌లేద‌ని బాబుకు తెలిసింది. మ‌రీ ముఖ్యంగా నాలుగు సార్లు ఓట‌మిపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే జిల్లా ప‌గ్గాలు అప్పగించ‌డం ప్రధాన‌మైన మైన‌స్ అయ్యింద‌ని తేలింది. ఇక ఎన్నిక‌ల్లో ఓడిన టీడీపీ నేత‌లు అంద‌రూ ఇప్పుడు బ‌య‌ట‌కే రావ‌డం లేద‌ట‌.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  త‌న రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం జిల్లాలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ్రూపులు రెచ్చగొట్టి అన్ని చోట్లా పార్టీని ముంచార‌న్నది బాబుకు ఇప్పట‌కీ అర్థమైంద‌ట‌. టికెట్ ఆశించిన వారికి కాకుండా కొత్తగా వ‌చ్చిన నాయ‌కులకు నియోజ‌క‌వ‌ర్గాల్లో బాధ్యత‌లు అప్పగించ‌డం, వెంక‌ట‌గిరిలో ప్రజావ్తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ దూకుడును ప్రజ‌లు ఇష్టప‌డ‌డం లేద‌ని తెలిసి కూడా ఆయ‌న‌కే టికెట్ ఇవ్డం, నెల్లూరు రూర‌ల్‌లో కోటంరెడ్డిని ఎదుర్కొనేందుకు స‌త్తా నాయ‌కుడిని ఎంపిక చేయ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. దీంతో చంద్రబాబు త్వర‌లోనే ఆప‌రేష‌న్ నెల్లూరును స్టార్ట్ చేయాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.