తెలంగాణ పై బీజేపీ టార్గెట్ ఫిక్స్ ! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ పై బీజేపీ టార్గెట్ ఫిక్స్ !


హైదరాబాద్ జూలై 8 (way2newstv.com
బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ తమ మొదటి టార్గెట్ మాత్రం తెలంగాణనే అని స్పష్టం చేసింది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ చానెల్ తో మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారం వచ్చారని.. ఆయన పనులు - పాలన నచ్చక వ్యతిరేకత వస్తోందని.. తెలంగాణలో కాంగ్రెస్ కుదేలైన వేళ ప్రతిపక్షంగా ఎదిగి టీఆర్ ఎస్ ను కూలదోస్తామని మురళీధర్ రావు అన్నారు.

తెలంగాణ పై బీజేపీ టార్గెట్ ఫిక్స్ !

ఇక ఏపీలోనూ టీడీపీ పని ఈ ఎన్నికలతో అయిపోయిందని.. అక్కడ ప్రతిపక్షంగా బీజేపీని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే నాయకులు చేరుతున్నారని మురళీధర్ రావు అన్నారు. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అఖండ మెజార్టీతో గద్దెనెక్కడంతో ఆరు నెలల టైం మాత్రమే ఇస్తామని.. ఆ తర్వాత ఏపీలోనూ వైసీపీని టార్గెట్ చేస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు.దీన్ని బట్టి మొదటి టార్గెట్ టీఆర్ ఎస్ - ఆ తర్వాత రెండో టార్గెట్ వైసీపీని అని బీజేపీ జాతీయ పార్టీలో కీలకంగా ఉన్న మురళీధర్ రావు చెప్పడం సంచలనంగా మారింది. ఆరు నెలల్లోనే ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తామన్న ఆయన మాటలు కలకలం రేపుతున్నాయి. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది