మళ్లీ నష్టాల్లో మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

ముంబై, జూలై 12, (way2newstv.com)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య వాణిజ్య యుద్దం మళ్లీ తెరపైకి రావడంతో... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు పతనమై 38,736కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 11,552 వద్ద స్థిరపడింది.
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (2.44%), సన్ ఫార్మా (2.41%), టాటా స్టీల్ (2.34%), ఏషియన్ పెయింట్స్ (2.05%), హీరో మోటో కార్ప్ (2.04%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.08%), ఓఎన్జీసీ (-2.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.87%), ఎల్ అండ్ టీ (-1.85%).