ఆకట్టుకుంటున్న థియేట్రికల్ ట్రైలర్‌ డియర్ కామ్రేడ్ స్టోరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆకట్టుకుంటున్న థియేట్రికల్ ట్రైలర్‌ డియర్ కామ్రేడ్ స్టోరీ

హైద్రాబాద్, జూలై 11 (way2newstv.com)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘డియర్ కామ్రేడ్’ థియేట్రికల్ ట్రైలర్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే టీజర్, పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ‘కామ్రేడ్’.. ఈ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు. ఈనెల 26న థియేటర్‌లో అభిమానులకు అదిరిపోయే సినిమాను అందించనున్నానని సూచన ప్రాయంగా చెప్పేశాడు. ఎందుకంటే, ఈ ట్రైలర్‌లో ఎమోషన్, లవ్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. స్టూడెంట్ లీడర్ బాబి, స్టేట్ క్రికెట్ ప్లేయర్ లిల్లీల లవ్‌స్టోరీ ఈ ‘డియర్ కామ్రేడ్’. ‘ఒక కామ్రేడ్ పోరాడితో ఆ పోరాటం అతనికి హాయినివ్వాలి.. స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు’ అంటూ చారుహాసన్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. 
ఆకట్టుకుంటున్న థియేట్రికల్ ట్రైలర్‌ డియర్ కామ్రేడ్ స్టోరీ

ఇక ఆ తరవాత విజయ్‌లోని కోపాన్ని, ఎమోషన్‌ను చూపించారు. అంటే కామ్రేడ్‌కు ఉండాల్సిన ప్రశాంతత ఇతనిలో లేదు. కాలేజీలో రాజకీయాలపై ఎదురెళ్లిన నాయకుడు చైతన్య(బాబి)గా విజయ్ దేవరకొండ నటించారు. ధైర్యం, తెగువ చాలా ఎక్కువ. విపరీతమైన కోపం. ఇలాంటి వ్యక్తి ఒక క్రికెట్ ప్లేయర్‌(రష్మిక మందన)తో ప్రేమలో పడతాడు. ఆ తరవాత ఈ ప్రేమ ప్రయాణం ఎలా సాగింది, చివరకు ఏమైంది అనేదే సినిమా. ట్రైలర్ చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ అభిమానులు ఆశించినట్టే సినిమాలో రెండు లిప్‌లాక్‌లు, రౌడీ డైలాగులకు కొదవలేదు. లిల్లీ క్రికెట్ ఫ్రెండ్స్‌తో వచ్చీరానీ హిందీలో విజయ్ మాట్లాడే డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మరి, అంచనాలను అందుకుందో లేదో ప్రేక్షకులే చెప్పాలి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేశారు. తమిళం, మలయాళం, కన్నడ ట్రైలర్లను త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.