అమరావతి, జూలై 24 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన ఒడిశా సీనియర్ బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11.35 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించారు.
ఏపీ గవర్నర్ గా హరిచందన్ ప్రయాణ స్వీకారం
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్నే ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసరు. ఆయన స్థానంలో ఇటీవల బిశ్వభూషణ్ నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీజే, సీఎం జగన్ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గవర్నర్ కు అతిథులను పరిచయం చేసారు.
Tags:
Andrapradeshnews