తహశీల్దార్ లావణ్య ఆరెస్టు

రంగారెడ్డి జూలై 11 (way2newstv.com)
రంగారెడ్డి జిల్లా కేశవపేట తహశీల్దార్ లావణ్యను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. విఆర్ఒ అంతయ్య 4 లక్షల రూపాయిల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. అంతయ్య వెనుక లావణ్య పాత్ర ఉందని అధికారులు ఆధారాలు సేకరించారు. హిమాయత్నగర్లోని లావణ్య నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. 
తహశీల్దార్ లావణ్య ఆరెస్టు

93.50 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండెళ్ల క్రితం లావణ్య ఉత్తమ తహసీల్దార్గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. లావణ్య  ఇంట్లో  బీరువాలు, కప్ బోర్డులు, అల్మారాలు.. ఎక్కడ చూసినా రూ. 2000, రూ.500 నోట్ల కట్టలే కనిపించాయి.  ఆస్తులకు, బంగారు ఆభరణాలు కుడా దొరికాయి. నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లను వినియోగించారు. 
Previous Post Next Post