తెలంగాణాలో అభివృద్ధి పథకాలు చాలా భేష్.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణాలో అభివృద్ధి పథకాలు చాలా భేష్..

కితాబిచ్చిన కర్ణాటక రాష్ట్ర మైసూర్ జెడ్పీటీసీ బృందం 
- ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే గ్రామీణ ప్రాంతాభివృద్ధి 
- వ్యవస్థాపరమైన విధి విధానాలు, అధికారాలు, నిధుల లభ్యత, జీత భత్యాలు, ఇతరత్రా అంశాలపై చర్చించిన సిద్ధిపేట, మైసూర్ జెడ్పీటీసీ బృందాలు 
సిద్ధిపేట, జూలై 11 (way2newstv.com)
సహజ వనరులను కాపాడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం పేరిట భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదను సృష్టిస్తున్నామని సిద్ధిపేట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్ధిపేట జెడ్పీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మైసూర్ జిల్లా పరిషత్తు చైర్మన్ పరిమళ శ్యామ్, 35 మంది జిల్లా పరిషత్ సభ్యులు, ఎన్ఐఆర్డీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై స్టడీ టూర్ లో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల జెడ్పీ సమావేశ చర్చ వేదికలో ప్రభుత్వం చేపట్టిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 
తెలంగాణాలో అభివృద్ధి పథకాలు చాలా భేష్..

ఈ సందర్భంగా సిద్ధిపేట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, ఆసరా పించన్లు, ఇంకుడు గుంతలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే మాజీ మంత్రి వర్యులు హరీశ్ రావు ప్రాతినిధ్యం సిద్ధిపేట జిల్లా స్థితిగతులపై సవివరంగా వివరించారు. ఈ మేరకు మైసూర్ జెడ్పీ చైర్మన్ పరిమళ శ్యామ్, 35 మంది జిల్లా పరిషత్ సభ్యులు మాట్లాడుతూ.. వారసత్వ సంపదకు నిలయమైన ప్యాలెస్, ఇతరత్రా చారిత్రాత్మక ప్రదేశాల మైసూరును పరిరక్షించడంతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రజా ప్రతినిధులను, అధికారులకు కితాబునిచ్చారు. ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, మండలం, గ్రామాల వారీగా చేపడుతున్న విధి విధానాల తీరు తెన్నులపై, గ్రామాభివృద్ధి అంశాలపై సిద్ధిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో అమలు చేస్తున్న వివిధ పతకాలను బేరీజు చేసుకుని, ఇక్కడి మంచి పద్ధతులను తమ ప్రాంతంలో సైతం అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వ్యవస్థాపరమైన విధి విధానాలు, తమ అధికారాలు, నిధుల లభ్యత, జీత భత్యాలు, ఇతరత్రా విషయాలపై అవగాహన చేసుకున్నారు. తెలంగాణాలో అభివృద్ధి పథకాలు చాలా భేష్ గా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో గ్రామీణ ప్రాంతాలలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీటీసీలు మంగ, కవిత, ఉమాదేవి, లక్ష్మీ, ఎంపీపీలు శ్రీదేవి-మాణిక్ రెడ్డి, బాలమల్లు, బాల్ రంగం, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ నవీన్, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, వేదవతి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిలతో పాటు కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా జెడ్పీటీసీలు, ఎన్ఐఆర్డీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.