బుట్టా రేణుకు పదేళ్లు అజ్ఞత వాసమేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బుట్టా రేణుకు పదేళ్లు అజ్ఞత వాసమేనా

కర్నూలు, జూలై 31, (way2newstv.com)
బుట్టా రేణుక.. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి ఒక టర్మ్ కే కనుమరుగై పోయారు. భర్త వేసిన తప్పటడుగుతో ఆమె రాజకీయ భవిష్యత్తు దాదాపుగా కోల్పోయారనే చెప్పాలి. మహిళలు సహజంగా భర్త వెంటే నడుస్తారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది సాధారణంగా జరిగే విషయం. కానీ బుట్టా రేణుక స్వయంకృతాపరాధం అనే కంటే భర్త నీలకంఠం చేసిన పొరపాట్ల వల్లనే రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నది జిల్లాలో విన్పిస్తున్న టాక్.బుట్టారేణుక, బుట్టా నీలకంఠం కుటుంబం రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తలుగా గుర్తింపు.అనేక విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో బుట్టా కుటుంబానికి అరుదైన అవకాశమే లభించింది. బుట్టా రేణుకకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీ టిక్కెట్ ను కేటాయించారు. 
బుట్టా రేణుకు పదేళ్లు అజ్ఞత వాసమేనా

ఈ ఎన్నికల్లో బుట్టా రేణుక విజయం సాధించారు. దీంతో బుట్టారేణుక రాజకీయాల్లో రాణించగలరని ఇటు కుటుంబసభ్యులు, అటు అనుచరులు భావించారు.అయితే బుట్టా రేణుక భర్త నీలకంఠం వేసిన రాంగ్ స్టెప్ ఆమె రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేసింది. 2014లో బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచినప్పటికీ, వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. దీంతో బుట్టా రేణుక భర్త నీలకంఠం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో రేణుకపై కూడా వైసీపీలో అనుమానాలు మొదలయ్యాయి. భర్త అధికారపార్టీలో ఉన్నా రేణుక మాత్రం వైసీపీలోనే చాలాకాలం కొనసాగారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండం, జగన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు డుమ్మా కొట్టడంతో బుట్టా రేణుకను జగన్ పక్కన పెట్టేశారు.దీంతో బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కర్నూలు ఎంపీ టిక్కెట్ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందని భావించిన బుట్టా రేణుకకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఏ టిక్కెట్ దక్కకపోవడంతో చివరి క్షణంలో బుట్టా రేణుక జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాను తప్పు చేశానని ఒప్పుకున్నారు. భర్త నీలకంఠం టీడీపీలో చేరడం వల్లనే బుట్టా రేణుక రాజకీయంగా ఎదగలేకపోయారన్నది వారి కుటుంబం నుంచి విన్పిస్తున్న మాట. ఇప్పుడు బుట్టా రేణుకకు రాజకీయంగా మరో పదేళ్లు కష్టకాలమే. ఎందుకంటే వచ్చే ఎన్నికలకూ కర్నూలులో ఏ పార్టీ టిక్కెట్ కూడా లభించడం కష్టమే.