దేవాదాయ భూముల్లో ఆదాయం దిశగా. అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేవాదాయ భూముల్లో ఆదాయం దిశగా. అడుగులు

నల్గొండ, జూలై 19, (way2newstv.com)
వుడి భూముల్లో షాపింగ్ మాల్స్‌ను నిర్మించాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఎండోమెంట్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలను గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే షాపింగ్ మాల్స్‌ను నిర్మించాలని ఆ శాఖ పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తోంది. రాబడితో పాటు భూముల ను పరిరక్షించుకోవచ్చన్న ఆలోచనలో ఆ శాఖ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు దీనిపై ఫో కస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కబ్జాకు గురైన ఎండోమెంట్ భూముల పరిరక్షణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం అటవీ భూములను సర్వే చేస్తున్న మాదిరిగానే దేవుడి భూములను సర్వే చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 
దేవాదాయ భూముల్లో ఆదాయం దిశగా. అడుగులు

దేవుడి మాన్యాల భూములను రెవెన్యూ రికార్డుల్లో దేవుడి పేరుతో రికార్డు చేయనున్నారు. వీటిలో కమర్షియల్ నిర్మాణాలతో వచ్చే రాబడితో దేవాలయాలను ఆధునీకరించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చా లా చోట్ల ఎండోమెంట్‌కు ఖాళీ భూములు ఉన్నా యి. కొన్ని చోట్ల అన్యాక్రాంతం కాగా మరికొన్ని చోట్ల కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మిగిలిన వాటినైనా రక్షించుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఆ శాఖ ప్రణాళికలను రూపొందించినట్టుగా సమాచారం.ఖాళీ స్థలాల్లో వాణిజ్య భవనాలతో పాటు కళ్యాణ మండపాలు నిర్మించాలని, వీటిని బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీఓటి) విధానంలో సమకూర్చకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికి అటవీ భూముల సం రక్షణ తరహాలోనే సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టుగా దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో 87,235.39 ఎకరాల భూమి ఉండ గా దేవాలయం ఆధీనంలో 2,458.05 ఎకరాలున్నాయి. ఇందులో దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో 20,124 ఎకరాల భూమి కబ్జాకు గురి అయినట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు లీజుకిచ్చిన భూములు 21,238 ఎకరాలు ఉందని 19,692 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, 2,122 ఎకరాల భూమి వివిధ ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి భూ సేకరణ పరిధిలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా దేవాదాయ భూముల పరిరక్షణకు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కఠినచర్యలు తీసుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే కమిషనర్ జిల్లాల వారీగా ఎగ్జిక్యూటీవ్ అధికారులను నియమించి స్పెషల్ డ్రైవ్‌లను చేపట్టారు.రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 12 వేల దేవాలయాలకు దాదాపు 87,235 ఎకరాల భూములు ఉన్నట్టు తేలింది. కానీ వీటిపై యాజమాన్య హక్కులు రెవెన్యూ రికార్డుల్లో దేవాదాయ శాఖ పేరు మీద లేవు. మరోవైపు కాస్రా, పహాణీ, కబ్జాకాలంలో ఇతరుల పేర్లు వస్తుండడంతో న్యాయపరమైన వివాదాలు పెరిగాయి. ఈ మాన్యాలను కౌలుకు తీసుకున్న వారు పొరుగు భూ యజమానులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ ఓ నివేదికను తయారు చేయించినట్టుగా తెలిసింది. ఆ భూములను కబ్జాదారుల నుంచి ఎలాగైనా తమ శాఖ ఆదీనంలోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఆయన ముందుకెళుతున్నట్టుగా సమాచారం. 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కబ్జాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారని అందులో భాగంగానే వాటిపై కోర్టులో కేసు గెలిచేలా జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేసినట్టుగా తెలిసింది.ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని, కేసు గెలిచిన అనంతరం మిగతా భూములను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో వారు దీనిపై ఫో కస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కబ్జాకు గురైన ఎండోమెంట్ భూముల పరిరక్షణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అనంతరం అటవీ భూములను సర్వే చేస్తున్న మాదిరిగానే దేవుడి భూములను సర్వే చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దేవుడి మాన్యాల భూములను రెవెన్యూ రికార్డుల్లో దేవుడి పేరుతో రికార్డు చేయనున్నారు. వీటిలో కమర్షియల్ నిర్మాణాలతో వచ్చే రాబడితో దేవాలయాలను ఆధునీకరించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చా లా చోట్ల ఎండోమెంట్‌కు ఖాళీ భూములు ఉన్నా యి. కొన్ని చోట్ల అన్యాక్రాంతం కాగా మరికొన్ని చోట్ల కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మిగిలిన వాటినైనా రక్షించుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఆ శాఖ ప్రణాళికలను రూపొందించినట్టుగా సమాచారం.ఖాళీ స్థలాల్లో వాణిజ్య భవనాలతో పాటు కళ్యాణ మండపాలు నిర్మించాలని, వీటిని బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీఓటి) విధానంలో సమకూర్చకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికి అటవీ భూముల సం రక్షణ తరహాలోనే సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టుగా దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో 87,235.39 ఎకరాల భూమి ఉండ గా దేవాలయం ఆధీనంలో 2,458.05 ఎకరాలున్నాయి. ఇందులో దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో 20,124 ఎకరాల భూమి కబ్జాకు గురి అయినట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు లీజుకిచ్చిన భూములు 21,238 ఎకరాలు ఉందని 19,692 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, 2,122 ఎకరాల భూమి వివిధ ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి భూ సేకరణ పరిధిలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా దేవాదాయ భూముల పరిరక్షణకు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కఠినచర్యలు తీసుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే కమిషనర్ జిల్లాల వారీగా ఎగ్జిక్యూటీవ్ అధికారులను నియమించి స్పెషల్ డ్రైవ్‌లను చేపట్టారు.రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 12 వేల దేవాలయాలకు దాదాపు 87,235 ఎకరాల భూములు ఉన్నట్టు తేలింది. కానీ వీటిపై యాజమాన్య హక్కులు రెవెన్యూ రికార్డుల్లో దేవాదాయ శాఖ పేరు మీద లేవు. మరోవైపు కాస్రా, పహాణీ, కబ్జాకాలంలో ఇతరుల పేర్లు వస్తుండడంతో న్యాయపరమైన వివాదాలు పెరిగాయి. ఈ మాన్యాలను కౌలుకు తీసుకున్న వారు పొరుగు భూ యజమానులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ ఓ నివేదికను తయారు చేయించినట్టుగా తెలిసింది. ఆ భూములను కబ్జాదారుల నుంచి ఎలాగైనా తమ శాఖ ఆదీనంలోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఆయన ముందుకెళుతున్నట్టుగా సమాచారం. 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కబ్జాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారని అందులో భాగంగానే వాటిపై కోర్టులో కేసు గెలిచేలా జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని, కేసు గెలిచిన అనంతరం మిగతా భూములను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలిసింది.