రాష్ట్రం లో పశు సంపద వృద్ధికి నూతన ఒరవడి తో కార్యక్రమాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్రం లో పశు సంపద వృద్ధికి నూతన ఒరవడి తో కార్యక్రమాలు


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నల్గొండ, జూలై 5, (way2newstv.com)
రాష్ట్రం.లో పశు సంపద అభివృద్ధికి అనేక  కార్య్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి తలసాని యాదవ్ అన్నారు.శుక్రవారం నల్గొండ జిల్లా నల్గొండ మండలం చర్ల పల్లి లో పశువుల కు గాలి కుంటు వ్యాధి నివారణ  టీకాల కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయి లో రాష్ట్ర విద్యా శాఖా మంత్రి జగదీశ్ రెడ్ది తో కలిసి ప్రారభించారు.అనంతరం పశువుల ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రదర్శన లో ఒంగోల్, తార్పార్కర్, గిర్ జాతుల పశువుల ప్రదర్శన,అసిల్, కడిక్,నాథ్ కోళ్ళు,వివిధ రకాల పశు గ్రాసాల ప్రదర్శన,గొర్రెల ప్రదర్శన ను మంత్రులు తిలకించారు.


రాష్ట్రం లో పశు సంపద వృద్ధికి నూతన ఒరవడి తో కార్యక్రమాలుఈ సందర్భంగా పశువులు,గొర్రెల పెంపకం దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ  రాష్ట్రం లో పశు సంపద పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.వర్షాలు రాగానే వ్యాధులు వ్యాపిస్తాయని, వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ముందు జాగ్రత్తగా నివారణకు గాలి కుంటు నివారణ రైతులు, పశు పెంపకం దారులు టీకాలు వేయించుకోవాలని కోరారు.ముందు జాగ్రత్త లేకుంటే మూగ జీవాలు మృత్యు వాత పడే ప్రమాదముందని అన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా  నూతనంగా వస్తున్న టెక్నాలజీ తో పాటు పశు సంపద అభివృద్ధికి కొత్త ఒరవడి తో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పశువుల వ్యాది చికిత్సకు వ్యాధి నిర్దారణ కు వైద్యం అందించేందుకు పశు పోషణ దారులకు కార్డు అందిస్తున్నట్లు తెలిపారు.పాడి రైతులకు గాలి కుంటు వ్యాధి టీకాల వివరాలు సెల్ ఫోన్ ద్వారా చేర్చేందుకు రిలియన్స్ సహకారంతో వాయిస్ మెస్సీజి లు పంపే కార్యక్రమం కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రం లో పశు సంవర్థక ఆస్పత్రులు భవనాలు పురాతన భవనాలు ఉండగా,రాష్ట్రం లో 642 పశు వైద్యశాలలు  ఉన్నతీకరణ చేసినట్లు, ఈ సంవత్సరం 700 ఆస్పత్రులు కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైతులు టీకాలు వేయించుకునేలా పశు వైద్యాధికారులు ,గోపాల మిత్ర లు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.అనంతరం రాష్ట్ర విద్యా శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్ది మాట్లాడుతూ వ్యవసాయం,పశు సంపదకు విడదీయరాని సంబంధం ఉందని,పశు సంపద లేని వ్యవసాయం లేదని అన్నారు.గో మాత లతో వేల సంవత్సరాల నుండి మనిషికి అనుబంధం ఉందని,పశు సంపద భూ భాగం ప్రకృతి ని రక్షిస్తుందని అన్నారు.తల్లిపాలు శ్రేష్టమైన ఆహారం అని,పాలు అవసరం మేరకు అందుబాటులో లేకపోవడంతో పాటు కల్తీ జరుగుతోందని అన్నారు.2014 సం. లో రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు పశుసంపద పెంపుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.పాలు మహారాష్ట్ర నుండి,మాంసం బయటి రాష్ట్రాల నుండి వస్తోందని అన్నారు.గొర్రెలు,పాడి గేదెలు సబ్సిడీ పై పంపిణీ చేస్తున్నట్లు,4  సం. లలో పశువుల సంపద,మాంసం ఉత్పత్తి లో గణనీయంగా ప్రగతి సాధించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 26,000 గొర్రెల యూనిట్లు పంపిణీ చరిసి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం లో ఉందని,పాడి పశువుల పంపిణీ లో 3600 యూనిట్ లు పంపిణీ చేసి జిల్లా ముందంజలో ఉందని,అదే విధంగా చేపల పెంపకం లో గత సంవత్సరం 3 కోట్ల చేప పిల్లల పెంపకం తో 19 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు,ఈ సంవత్సరం 5 కోట్ల చేప పిల్లల లక్ష్యంగా మిర్ణయించినట్లు తెలిపారు.సమగ్ర మత్స్య అభివృద్ది పథకం కింద జిల్లా కు కేటాయించిన 39 కోట్ల రూ.లలో ఇప్పటి వరకు 20 కోట్ల రూ.లు ఖర్చు పెట్టి మత్స్యకారులకు మోపెడులు,ఆటో లు,మౌలిక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.4 కోట్ల రూ. ల తో జిల్లాలో పశువులకు అధునాతన పశు వైద్య శాల నిర్మాణం చేసుకున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఎం.ఎల్.సి.తేరా చిన్నప రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్ది, చిరుమర్ధి లింగయ్య,పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,గొర్రెల అభివృద్ధి ఫెడరేషన్  ఎం.డి.లక్ష్మ రెడ్డి,మాజీ శాసన సభ్యులు వేముల వీరేశం, పశు సంవర్థక జె.డి.డా.రమేష్ తదితరులు పాల్గొన్నారు.