21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

కాకినాడ, ఆగస్టు 20  (way2newstv.com):
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి ఇటీవలే రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రెండో విడతలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మూడో, చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహింనున్నారు. ఆగస్టు 21 నుంచి 24 వరకు చివరి విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఎంసెట్-2019 ఉత్తీర్ణులై.. మొదటి, రెండు విడతల్లో సీట్లు పొందని అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. 
21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 21, 22 తేదీల్లో సహాయక కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన వారు అవే తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 24న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1200చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది