వైసిపి వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి టిడిపి ప్రత్యక్ష కార్యాచరణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైసిపి వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి టిడిపి ప్రత్యక్ష కార్యాచరణ

చంద్రబాబు
గుంటూరు ఆగస్టు 29 (way2newstv.com):             
పాత కేసులు తవ్వడం వైసిపి వేధింపులకు పరాకాష్ట. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు.గతంతో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడిపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా..? అని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అయన గుంటూరులో పార్టీ కార్యకర్తలతో అయన బేటీ అయ్యారు.  చంద్రబాబు మాట్లాడుతూ వందలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నోరునొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  ప్రశ్నించే హక్కు కాలరాయాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా చేయాలని చూస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు గతంలో చూడలేదని అన్నారు. ఇళ్లు తగులపెడుతున్నారు, భూములు సాగు చేసుకోనివ్వడం లేదు. బోర్లు ధ్వంసం చేస్తున్నారు. చీనీ చెట్లను నరికేస్తున్నారు. 
వైసిపి వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి టిడిపి ప్రత్యక్ష కార్యాచరణ

ఇంత అరాచక పాలన నా జీవితంలో చూడలేదు. వైసిపి నేతలు ఇప్పటికైనా అరాచకాలను మానుకోవాలి.  డిజిపిని టిడిపి ప్రతినిధి బృందం స్వయంగా కలిసి వినతి ఇచ్చింది. జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే అనేకమార్లు వినతులు ఇచ్చాం. అయినా గ్రామాల్లో వైసిపి అరాచకాలు తగ్గలేదు.  మొత్తం పోలీసు వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారు. పోలీసులే నిస్సహాయంగా మారితే ఇక రక్షణ ఎవరని అయన ప్రశ్నించారు.మంగళవారం నుంచి గుంటూరులో వైసిపి బాధితుల పునరాశ్రయ శిబిరం ప్రారంభమవుతుంది. పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులు అందరికీ ఆశ్రయం కల్పిస్తాం. బాధితులు అందరికీ గుంటూరు శిబిరంలో రక్షణ కల్పిస్తాం. ఆశ్రయం కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పిస్తామని అయన అన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా శిబిరాల్లోనే బాధితులు. నేనే దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు తోడ్కొని వెళ్తాను.  ఇళ్లపై దాడులు చేస్తున్నారు, భూములు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. పౌరులు అందరికీ నివసించే హక్కు ఉంది. అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అలాంటిది నివసించే హక్కును కాలరాస్తారా..? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తారా..? అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తారా..? బాధితులు అందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని చంద్రబాబు అన్నారు.