విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ స్పందించాలి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ స్పందించాలి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్ ఆగష్టు 29 (way2newstv.com):             
విద్యుత్ రంగంలో అవకతవకలపై బీజేపీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. 
విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ స్పందించాలి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బలపడుతోందని టీఆర్ఎస్ వాళ్లు చవకబారు విమర్శలు చేస్తున్నారని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ ఎద్దేవా చేశారు.