విజయవాడ, ఆగస్టు 14, (way2newstv.com)
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధికారులు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సీఎం జగన్ సీఎం హోదాలో మొదటిసారి జెండాను ఆవిష్కరించనున్నారు. స్టేడియం వద్ద అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
విజయవాడలో భారీ ఏర్పాట్లు
3వేల మంది ఈ ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నవరత్నాలపై ప్రత్యేక ప్రధర్శన కూడా నిర్వహించనున్నారు. గతంలో కంటే ఈసారి వేదికను మారుస్తున్నారు. వేదిక మొదటి గేట్ వైపుగా ఉండేది. ఇప్పుడు స్డేడియం రెండో గేటు వైపుగా వేదికను మార్చారు. దీంతో వేడుకలను నేరుగా రెండో గేట్ దగ్గర నుంచి చూడవచ్చు.
Tags:
Andrapradeshnews