ఆన్ లైన్ డేటింగ్ అంటూ కొత్త ప్రచారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆన్ లైన్ డేటింగ్ అంటూ కొత్త ప్రచారం

హైద్రాబాద్, ఆగస్టు 28, (way2newstv.com)
రొటీన్ లైఫ్ తో విసుగెత్తిపోయారా..? లైఫ్ ఎంజాయ్ కోసం మంచి పార్టనర్ ని వెతుకుతున్నారా.. జస్ట్ ఆన్ లైన్ లో క్లిక్ చేయండి.. కనిపించి కనిపించని అందాలతో అందమైన అమ్మాయిలు మీ కంటపడుతారు.. వారు చెప్పింది చేస్తే చాలు క్షణాల్లో వచ్చి మీ ఒళ్ళో వాలుతారు. ఇలా హైదరాబాద్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది కుర్రకారుకి వెర్రెక్కించి అందినంత దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మల మతలబు ఏమిటో తెలుసా?ఆన్ లైన్ ఇప్పుడంతా ఇదే ట్రెండ్. ఏ వస్తువు కొనాలన్నా నచ్చిన వస్తువు ఇంటికి రావాలన్న ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మన ఇంటికి వచ్చి చేరుతాయి. 
ఆన్ లైన్ డేటింగ్ అంటూ కొత్త ప్రచారం

ఆన్ లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ ఏదైనా సరే రోజుల తరబడి షాప్ లో చుట్టూ తిరగడం.. గంటలకొద్దీ సమయం వృధా చేయడం.. ఇవేవీ అవసరం లేదు.. జస్ట్ ఐదు నిమిషాలు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఓపెన్ చేసి నచ్చిన వస్తువును సెలెక్ట్ చేస్తే చాలు క్షణాల్లో ఏదైనా సరే మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఈ ట్రెండ్ ని ఓ ముఠా తెగ వాడేసుకుంది.అదెలా అంటారా.. సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటో కనపడితే చాలు లైక్ ల మీద లైకులు ..పోస్టుల మీద పోస్ట్లు పెట్టి సోల్లుకార్చే కుర్రకారుని టార్గెట్ చేసింది ఓ ముఠా. ఆన్ లైన్ డేటింగ్ అంటూ ఓ వెబ్ సైట్ ని మొదలు పెట్టింది. అందమైన అమ్మాయిలు కనిపించి కనిపించని అందాలతో యువకులను పిచ్చోళ్లను చేసింది. ముందు పరిచయం.. ఆ తర్వాత జాతకం.. మరుక్షణం అకౌంట్ ప్రాసెస్.. రెండు వేలు కడితే చాలు అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుంది . కౌగిలిలో బందీ చేస్తుంది.. కావాల్సినన్ని రోజులు మీతో గడిపేస్తుంది.. అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఇంకేముంది నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసి అడిగినంత ఎకౌంట్లో వేస్తూ వచ్చారు.. ఆ తర్వాత షరా మామూలు.ఫోన్లు స్విచాఫ్ రావడం.. ఎన్ని మెసేజ్ పెట్టినా రిప్లై లేకపోవడం.. తాము మోసపోయామని తెలుసుకున్న చాలా మంది బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆన్ లైన్ డేటింగ్ దాన్ని చాటింగ్ వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. కోల్ కత్తా కేంద్రంగా ఈ ముఠా ఎత్తులు వేస్తోంది అని తెలుసుకొని అది చిత్తు చేయాలని నిర్ణయించారు. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముందుగా వారి వివరాలు అడ్రస్ కనిపెట్టిన బృందాలు, నేరుగా కోల్ కత్తా వెళ్లి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కోర్టులో హాజరు రచి అందులో ముగ్గురు ప్రధాన నిందితులను హైదరాబాద్ తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు.
=