తరుణ్ రాజ్ పై కేసులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తరుణ్ రాజ్ పై కేసులు

హైద్రాబాద్,  ఆగస్టు 21 (way2newstv.com
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తోన్న టీఎస్ 09 ఈఎక్స్ 1100 నంబరుతో ఉన్న వోల్వో ఎస్90 లగ్జరీ కారు అల్కాపురి టౌన్‌షిప్ సమీపంలో ఉన్న నార్సింగి సర్కిల్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత ప్రమాదానికి గురైంది. సర్కిల్ వద్ద మలుపు ఉండటంతో అదుపుతప్పిన రాజ్ తరుణ్ కారు.. రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతింది. రాజ్ తరుణ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదం నుంచి బయటపడిన రాజ్ తరుణ్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ప్రమాదం జరిగిన తరవాత కారును అక్కడే వదిలిపెట్టి రాజ్ తరుణ్ పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 
తరుణ్ రాజ్ పై కేసులు 

వీటి ఆధారంగా యాక్సిడెంట్ చేసింది రాజ్ తరుణ్ అని నార్సింగి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, పోలీసులు విచారణలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అసలు, ఆ కారు రాజ్ తరుణ్ పేరిట రిజిస్టర్ అయ్యిలేదు. లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరిట రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ కంపెనీ బాధ్యతలు చూసుకుంటోన్న ప్రదీప్ అనే వ్యక్తికి పోలీసులు నోటీసులు పంపినట్లు సమాచారం.ఇదిలా ఉంటే, కారు రిజిస్ట్రేషన్.. అది రాజ్ తరుణ్ వద్ద ఎందుకు ఉంది? వంటి విషయాలపై టీవీ9 న్యూస్ ఛానెల్‌తో ప్రదీప్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ వోల్వో కారును నిర్మాత రామ్ తాళ్లూరి చైర్మన్‌గా ఉన్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిందని చెప్పారు. ‘నేల టిక్కెట్’ సినిమా సమయంలో రాజ్ తరుణ్‌తో మరో సినిమాను కూడా తాము ప్రకటించామని, ఒప్పందంలో భాగంగా ఆయనకు ఈ కారు ఇచ్చామని ప్రదీప్ వెల్లడించారు. కారు ఇచ్చాం కానీ, రిజిస్ట్రేషన్ మార్చలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న నార్సింగి పోలీసులు ఐపీసీ 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన వోల్వో కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం తరవాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లారు? అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.