వంద మందికే ట్రైనింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వంద మందికే ట్రైనింగ్

అదిలాబాద్‌, ఆగస్టు 20, (way2newstv.com
అన్నీ ఉన్నా...అల్లుడి నోట్లో శని అన్న చందాన తయారైంది. హకీంపేట,కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ (రీజినల్‌ హాస్టల్‌) జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు క్రీడాపాఠశా లలు ఉన్నాయి.రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్‌ అకాడమీలున్నాయి. వీటిన్నింటిలో కలిపి కేవలం వంద మంది క్రీడాకారులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడగా కబడ్డీని ప్రభుత్వం గుర్తిం చింది. అయితే ఆ క్రీడకూ అకాడమీ లేకపోవడం గమనార్హం. గ్రా మీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆడే ఖోఖో, వాలీబాల్‌కు ప్రత్యేకంగా అకాడమీలు లేవు. 2003-04లో పలు క్రీడలకు జిల్లాల్లో అకాడ మీలు ఏర్పాటు చేయగా, నిధుల లేమితో 2008లో వాటిని మూసి వేశారు. గతంలో వాలీబాల్‌ అకాడమీ ఎల్‌బీ స్టేడియంలో ఉండేది. 
వంద మందికే ట్రైనింగ్

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కోచ్‌ల విభజన, వసతి సదు పాయాలు సరిగాలేకపోవడంతో దాన్ని ప్రభు త్వం మూసివేసింది. అప్పటి నుంచి దాని ఏర్పాటు ఆలోచన మరిచిపోయింది. గతంలో కబడ్డీ అకాడమీ ఉన్నా అది వివిధ కారణాలతో మూత పడింది. ప్రస్తుతం తిరిగి ప్రారంభించే ఆలోచనా చేయడం లేదు. అంతర్జాతీయ స్థా యిలో రాష్ట్రక్రీడాకారులు పతకాలు తీసుకొ స్తున్న బాక్సింగ్‌కు ప్రత్యేకంగా అకాడమీలు లేవు. అయితే రాష్ట్రంలో పెద్దగా క్రీడాకారులు లేని కయాకింగ్‌, రోయింగ్‌, కనోయింగ్‌ క్రీడలకు స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో శిక్షణ ఇస్తున్నారు.... వీటితో పాటు ప్రత్యేకంగా ఖమ్మంలో అథ్లెటిక్స్‌ అకాడమీ(బాలుర), హైదరాబాద్‌లో సైక్లింగ్‌, రెస్లింగ్‌ అకాడమీలుం డగా, కొత్తగా వనపర్తిలో హాకీ అకాడమీ(బాలుర) ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో సుమారు వెయ్యి మంది క్రీడాకారులు శిక్షణ తీసుకుం టున్నారు. మొత్తం శిక్షణ కోసం చేరిన విద్యార్థుల్లో సగంమంది ఒక్క హకీంపేట క్రీడా పాఠశాలలోనే ఉండటం గమనార్హం. హకీంపేట స్కూల్‌లో అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, ఆర్చరీ, వాలీబాల్‌, ఫెన్సింగ్‌, జిమ్నా స్టిక్‌, కరీంనగర్‌ స్కూల్‌లో అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, జూడో, స్విమ్మింగ్‌, కనోయింగ్‌, కయాకింగ్‌, రోయింగ్‌క్రీడలు, వరం గల్‌ స్కూల్‌లో హ్యాండ్‌బాల్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, ఆదిలాబా ద్‌లో అథ్లెటిక్స్‌ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో సాట్స్‌గుర్తించిన క్రీడ లు 50వరకూ ఉంటే, శిక్షణ ఇస్తున్నది కేవలం 16క్రీడల్లో మాత్రమే. దీంతో క్రీడలంటే ఇష్టమున్నా, అకాడమీలు లేక, శిక్షకులు లేక విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. క్రీడలకు దూరమవుతున్నారు.తెలంగాణలో మొత్తం 95మంది మాత్రమే శిక్షకులు (కోచ్‌) ఉన్నా రు. వీరిలో 34మంది కాంట్రాక్టు, 53మంది ఔట్‌సోర్సింగ్‌ కోచ్‌లుం డగా, కేవలం 8మంది మాత్రమే పర్మినెంట్‌ శిక్షకులు న్నారు. వీరిలోనూ శిక్షణ బాధ్యతల కంటే ఇతర బాధ్యతలు నిర్వ హించే వారేఅధికం. ఇటీవల శారుతో పాటు గిరిజనశాఖ విడు దల చేసిన కొత్త కోచ్‌ల నియామకాల వైపు ప్రస్తుతమున్న కోచ్‌లు చూస్తు న్నారు. దీని ప్రభావంతో సగంమంది కోచ్‌లు అటువైపువెళ్లే అవకాశ మున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే 2018జనవరిలో జరిగిన సాట్స్‌ పాలక మండలిలో కొత్తగా వందమంది కాంట్రాక్టు కోచ్‌లను తీసుకోవాలని తీర్మానం చేశారు. ఏడునెలల దాటినా ఇప్ప టికీ అది తీర్మానంగానే మిగిలిపోయింది. దీనికితోడు క్రీడాకారులకు ఇచ్చే సామాగ్రి కూడా సరిగా ఇవ్వడం లేదనే ఆరో పణలున్నాయి.