హారిత హారం మొక్కలకు జియో ట్యాగింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హారిత హారం మొక్కలకు జియో ట్యాగింగ్

హైద్రాబాద్‌, ఆగస్టు 20, (way2newstv.com)
హైద్రాబాద్‌ సిటీలో హరితహారం కార్యక్రమం కింద నాటుతున్న మొక్కల జియో ట్యాగింగ్ తుది దశకు చేరుకుంది. గత ఏడాది నాటిన మొక్కల్లో 95 శాతం మొక్కలు మనుగడ సాగిస్తుండటంతో పాటు చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలను నాటడంతో పాటు ఇపుడు నాటుతున్న మొక్కల్లో వందకు వంద శాతం మొక్కలు బతికేందుకు వీలుగా జియోట్యాగింగ్ ప్రక్రియను చేపట్టారు. హరితహారం కార్యక్రమం కింద ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 40లక్షల వరకు మొక్కలను నాటడం, పంపిణీ చేయట జరిగిందని, ఇందులో ఇప్పటి వరకు దాదాపు 35లక్షల 40వేల మొక్కలు నాటిన 652 ప్రాంతాల్లో జియోట్యాగింగ్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 
 హారిత హారం మొక్కలకు జియో ట్యాగింగ్

మొక్కలు జియోట్యాగింగ్ చేయటంలో రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే జిహెచ్‌ఎంసి ముందంజలో ఉన్నట్లు కూడా అధికారులు వివరించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో సుమారు 77 శాతం మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గతంలో హరితహారం నాటిన మొక్కలవిషయంలో పారదర్శకంగా ఉండటంతో పాటు తమ ప్రాంతాల్లో నాటిన మొక్కల పరిరక్షణ స్థానికులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ఈ జియోట్యాగింగ్ ద్వారా సులభతరం కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొక్కలను జియోట్యాగింగ్ చేయటంలో రాష్ట్రంలో జిహెచ్‌ఎంసి మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతిస స్థానంలో 72.5శాతంతో అదిలాబాద్, 69.57 శాతంతో మూడో స్థానంలో జగిత్యాల జిల్లా ఉన్నట్లు, ఇదే స్థానంలో కొత్తగూడెం, నిజామాబాద్, మేడ్చల్ జిల్లాలు తదుపరి స్థానాల్లో నిలిచినట్లు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నాటే కోటి మొక్కల్లో 93 లక్షల మొక్కలు నగరవాసులు కోరిన వాటిని ఉచితంగా పంపిణీ చేయనుంది. మిగిలిన ఏడులక్షల మొక్కల్లో గ్రీన్ కర్డెన్, గ్రీన్ వేస్, సర్జికల్ గార్డెన్స్, సంస్థాగత మొక్కల పెంపకం, ఖాళీ స్థలాలు, రహదారుల వెంట మొక్కలను జిహెచ్‌ఎంసి నాటుతోంది. దీనిలో భాగంగా 74 ఖాళీ స్థలాల్లో 31వేల 70, నగరంలోని 103 రహదారుల మార్గాల్లో 32వేల 478, 25 గ్రీన్ కర్టెన్‌లలో 55వేల 222 మొక్కలు, 14 గ్రీన్ వేలలో 52వేల 400, నగరంలోని 14 చెరవుల శిఖాలు, గట్ల వెంట 28వేల 90 మొక్కలు, ప్రతిపాదిత వంద పార్కుల్లో 2లక్షల 19వేల 136, హైదరాబాద్ నగరంలో ఉన్న 42 వివిధ సంస్థల్లో మరో 50వేల మొక్కలు నాటేందుకు జిహెచ్‌ఎంసి బయోడైవర్శిటీ విభాగం ప్రణాళికలను సిద్దం చేసింది. గత సంవత్సరం కేవలం జిహెచ్‌ఎంసి నాటిన 2.20లక్షల మొక్కల్లో 1.90లక్షల మొక్కలు సురక్షితంగా ఉన్నాయి.