బిజీ బిజీ షెడ్యూల్ లో జగన్

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  కుటుంబంతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్.. తొలిసారిగా అమెరికా వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అటు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆయన ఆగస్టు 17న ప్రసిద్ధ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రసంగించనున్నారు.
బిజీ బిజీ షెడ్యూల్ లో జగన్

సీఎం జగన్ తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో 3 రోజులు వ్యకిగత పనులు ఉండటంతో ప్రభుత్వం నుంచి సీఎం జగన్ ఎలాంటి ఖర్చులు తీసుకోవడం లేదని.. తన ఖర్చులను తానే భరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 17న మధ్యాహ్నం 2 గంటలకు  డల్లాస్‌ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో నార్త్‌ అమెరికా తెలుగు కమ్యూనిటీ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు.ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొంత మంది ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఏపీకి తిరుగు ప్రయాణమవుతారు.
Previous Post Next Post