హైద్రాబాద్, ఆగస్టు 16, (way2newstv.com)
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చేసిన నినాదాన్ని ఇప్పడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ఎత్తుకోవాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో మీ భవిష్యత్తు – నా బాధ్యత అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే అది పెద్దగా సక్సెస్ కాలేదనడానికి రుజువు ఎన్నికల ఫలితాలే. చంద్రబాబు బాధ్యత తమకు అవసరం లేదని ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పుుడ పార్టీ కోసం ఆ నినాదాన్నే మరోసారి ఎత్తుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది.నిజానికి ఇటీవల పార్టీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనకు అన్ని విధాలుగా ఉపయగపడే వారికే పదవులు ఇచ్చారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లాంటి వాళ్లకు రాజ్యసభ పదవులు ఇచ్చారు. కానీ వారు టీడీపీ ఓటమి పాలు కాగానే పార్టీని వదలి వెళ్లారు.
కొత్త నినాదంతో చంద్రబాబు
అదే అయ్యన్న, బుచ్చన్నలు స్వార్థపరులకు పదవులు ఇవ్వవద్దని చెప్పడంలో అర్థం.ఇక చంద్రబాబుకు సీనియర్లంటే కొద్దిగా గౌరవం….మరింతగా భయం ఉందంటారు పార్టీ నేతలు. నిజానికి గోరంట్ల అన్యాపదేశంగా అన్నా ఉపయోగం లేని యనమల రామకృష్ణుడు లాంటి వారికి ఎందుకు పదవులు కట్టబెట్టడమన్నది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. రాజకీయంగా ప్రజల్లో పట్టుకోల్పోయిన యనమలకు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంటే చంద్రబాబు అడ్డుకట్ట వేయలేకపోయారన్నది బుచ్చయ్య ఆవేదన. అందుకే సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బుచ్చయ్య అన్నారంటున్నారు.ఇక తెలుగుదేశం పార్టీకి రానున్నది కష్టకాలమే. ఎలాంటి పదవులు కనుచూపు మేరలో లేవు. పోరాటాల పేరుతో ఖర్చు తప్ప తమకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని తెలుగుతమ్ముళ్లు డిసైడ్ అయినట్లుంది. అందుకే అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాల పర్యటన చంద్రబాబు చేద్దామన్నా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే చంద్రబాబు పార్టీ నేతల కోసం మరోసారి మీ భవిష్యత్తు – నా బాధ్యత అనే నినాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
Tags:
telangananews