ఆర్మూర్ లో అంకాపూర్ చికెన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్మూర్ లో అంకాపూర్ చికెన్

నిజామాబాద్, ఆగస్టు 22, (way2newstv.com)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్.. వ్యవసాయానికి మారుపేరుగా నిలుస్తోంది. పంటల సాగులోనే కాదు వంటల్లోనూ మేమే నంబర్ వన్ అంటోంది. యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నాటుకోళ్లను ఎక్కువగా తినేవారు. అయితే వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపే రైతు కుటుంబాల వారికి కోడి కూర వండుకు తినేందుకు సమయం దొరికేది కాదు. ఇలాంటి వారి కోసమే కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టాడు ఓ వ్యక్తి... తన చికెన్ సెంటర్ లోని దేశీ కోడిని వండి విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ ఐడియాకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కొద్ది రోజుల్లో చికెన్ తో పాటు రైస్ కూడా జత కలిపాడు. ఇక చాలామంది రైతులు ఆర్డర్లు బుక్ చేసి పార్సల్ తీసుకెళ్లడం ప్రారంభించారు. నాటుకోడి చికెన్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి.. అంకాపూర్ చికెన్ పేరుతో మరికొన్ని సెంటర్లు వెలిశాయి. 
ఆర్మూర్ లో అంకాపూర్ చికెన్

పక్కనే ఉన్న ఆర్మూర్, మామిడిపల్లి, జక్రాన్ పల్లి, పెర్కిట్ లోని అంకాపూర్ చికెన్ అందుబాటులోకి వచ్చిందిదేశీ కోడి ఆ పేరు చెప్పగానే నోరూరని వారుండరు.. అలాంటి నాటు కోడి అంకాపూర్ చికెన్ గా ఎంతో క్రేజీని సంపాదించింది. అంకాపూర్ చికెన్ పేరుతో నాటు కోడి కుకింగ్ కేంద్రాలు గల్లీకొకటి వెలిశాయి. ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా మారాయి. ఇంతకీ అంకాపూర్ చికెన్ ప్రత్యేకత నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక వంటకంగా గుర్తింపు పొందింది అంకాపూర్ చికెన్.రాష్ట్రంలోనే పేరుగాంఛిన అంకాపూర్ చికెన్..అంకాపూర్ కుకింగ్ కేంద్రాలు నగరాల్లో సిత వెలిసాయి.పల్లెకు పరిమితమైన ఈ కుకింగ్ కేంద్రాలు..గ్రామాల్లో ఉపాధి లేక పలువురు నాటి కోడి కూర సెంటర్లను ఏర్పాటు చేసి వాటినే జీవనాధారంగా మలచుకున్నారు.రేటు ఎక్కువైనా నాటు కోడి తినడానికే నగర వాసులు మొగ్గు చూపుతుండటం వల్ల.. పల్లెకోడి సందడి చేస్తోంది.దేశీ కోడి అంటే అదో క్రేజీ.. ఆ క్రేజీ ఎంతలా ఉందంటే.. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి కేవలం అంకాపూర్ దేశి కోడి కూర తినడానికి జిల్లాకు వస్తున్నారంటే ఆ దేశీ కూరకు ఉన్న క్రేజీ ఏ పాటిదో అర్దం చేసుకోవచ్చు.మన ఇంట్లో వండినంత రుచిగా సుచిగా దేశీకూర నోరూరిస్తుం డటం ఆక్రేజీకి కారణంగా చెబుతారు భోజన ప్రియులు.ఒకప్పుడు జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన దేశికోడి.ఇప్పుడు జిల్లా కేంద్రంలోను సిత అక్కడక్కడ సెంటర్ లో లభిస్తుండటం విశేషం.దేశీకోడికి ఉన్న ఆదరణను ఆసరాగా చేసుకుని నిర్వహాకులు పల్లెను వదిలి పట్నంలో దేశీ కోడి కుకింగ్ సెంటర్లు నెలకొల్పారు.మార్కెట్ లో దేశీకోడి కిలో 300 పలుకుతుండగా.. కుకింగ్ కేంద్రాల్లో మాత్రం వండిన దేశీ కోడి కూర.. కిలో 650 పలుకుతుందని నిర్వహాకులు చెబుతున్నారు. ఇంట్లో తిన్న టేస్టు ఉండటం వల్లే ఆదరణ ఎక్కువగా ఉందని అంటున్నారు. అంకాపూర్ దేశీ చికెన్.. నిజామాబాద్ జిల్లా వాసులకు ప్రత్యేకమని అంటారు..బోజన ప్రియులు. ఒకప్పుడు అంకాపూర్ చికెన్ తినాలంటే.. గ్రామాల్లోకి వెళ్లాలిసిందే  అంకాపూర్ చికెన్ కుకింగ్ కేంద్రాల్లో తింటే ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుదని చెబుతున్నారు.. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కుకింగ్ కేంద్రాల నిర్వహాకులు వండి సిద్దం చేస్తున్నారని అంటున్నారు. హోటళ్లు పెరగడం వల్ల.. చికెన్ సెంటర్లకు దేశీ కోడి గిరాఖీ తగ్గిందని చాలా మంది కుకింగ్ కేంద్రాల్లోనే తింటున్నారని చికెన్ సెంటర్ నిర్వహాకులు చెబుతున్నారు...గ్రామల్లో ఎలాంటి జీవనోపాధి లేక .. పట్టణాలకు వలసొచ్చి తమకు తెలిపిన వృత్తిని జీవనాధారంగా చేసుకుని చాలా మంది నగరంలో దేశీ కోడి కుకింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం నగరంలో దేశీ కోడి కుకింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక్కొ కుకింగ్ సెంటర్ లో 30 కోళ్ల అమ్ముడవుతుండగా.. ఆదివారం  ఆ సంఖ్య రెట్టింపు అవుతాయని నిర్వహాకులు చెబుతున్నారు. పల్లెల నుంచి దేశీ కోళ్లను తెచ్చి కుకింగ్ కేంద్రాల్లో వండి ఇస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో వండిన చికెన్‌కు చాలా పేరుంది. పెళ్లిళ్లు, దావత్‌లు శుభకార్యాలేవైనా అంకాపూర్ దేశీ చికెన్ రుచి చూడాల్సిందే. నాటుకోడి దేశీ చికెన్‌ను వండేముందు కోడి మాంసాన్ని శుభ్రపరిచి పసుపు అద్ది అనంతరం మంటపై కాలుస్తారు. తరువాత శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వారే స్వయంగా నూరుకున్న మసాల దినుసులను కలిపి పాత్రలో వేసి దానికి అల్లం వెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి కలిపి పదినిమిషాలు ఉంచుతారు. తరువాత స్టౌవ్‌మీద పాత్రలో తగినంత పల్లీ నూనె పోసి ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి, కరివేపాకు, మెంతికూర వేసి వేగాక చికెన్ వేస్తారు. తగినంత నీరు, ఉప్పు వేసి ఉడికిస్తారు. అవసరం అనుకుంటే పాత్ర మీద ఒక మూత ఉంచి దానిలో కొన్ని నీళ్లు పోస్తారు. 20 నిమిషాలకు ఘుమఘుమలాడే దేశీ చికెన్ రెడీ అవుతుంది. ఇక్కడ వండిన చికెన్ దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నది. అమెరికా, శ్రీలంక, రష్యా, లండన్, గల్ఫ్ దేశాలైన దుబాయి, మస్కట్, బహ్రెయిన్, ఖతర్‌లకు నెలకోసారి ఇక్కడి నుంచి చికెన్ పార్సిల్స్ వెళుతుంటాయి. ఇక ముంబయి, హైదరాబాద్ ప్రాంతాలకు పుట్టినరోజులు ఇతర వేడుకలకు 50 నుండి 100 కిలోల వరకు దేశీ చికెన్ ఆర్డర్‌పై తీసుకెళ్తుంటారు. అంకాపూర్‌లోని భూమేశ్, పాపగౌడ్, కోళ్ల కిష్టయ్య, నారాయణగౌడ్, రాజు, రవిల అర్డర్ మెస్‌లలో.. దొరికే దేశీకోడి కూర రుచే వేరు. అంకాపూర్ గ్రామంలో సుమారుగా 1968 సంవత్సరంలో ఈ చికెన్ హోటళ్లు ప్రారంభం అయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంకాపూర్‌లో బోయ బొర్రన్న, తాళ్లపెల్లి చిన్నరామాగౌడ్, దుబ్బాగౌడ్‌లు చికెన్ హోటళ్లను నిర్వహించేవారు. ఒకప్పుడు 40 రూపాయలకు కిలో చికెన్ దొరికేది, ఇప్పుడు కిలో మాంసం రూ. 550 నుండి రూ. 700 వరకు ధర పలుకుతుంది.