కొనసాగుతున్న గోల్డ్ రన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనసాగుతున్న గోల్డ్ రన్

హైద్రాబాద్, ఆగస్టు 22, (way2newstv.com)
పసిడి పరిగెత్తింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.39,280కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నాకూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.170 పెరుగుదలతో రూ.36,010కు చేరింది. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.350 తగ్గుదలతో రూ.47,500కు దిగొచ్చింది. 
కొనసాగుతున్న గోల్డ్ రన్

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో 1,511.85 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.45 శాతం క్షీణతతో 17.07 డాలర్లకు తగ్గింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.38,400కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.37,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఏకంగా రూ.350 తగ్గుదలతో రూ.47,500కు క్షీణించింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.