అక్కరకు వచ్చిన ఉపాధి హామీ పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్కరకు వచ్చిన ఉపాధి హామీ పథకం

వరంగల్, ఆగస్టు 21, (way2newstv.com)
ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఉపాధి హామీకి హరితహారాన్ని అనుసంధానం చేసే పనిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. ప్రస్తుతం ఆ నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొక్కలు పెంచే కార్యక్రమం కోసం పంచాయతీరాజ్ శాఖ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉపాధి కూలీలు, సిబ్బంది, అధికారులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేసింది. నర్సరీల ఎంపిక, మొక్కల సంరక్షణ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉపాధిహామీ ద్వారా చేపట్టే మొక్కల పెంపకం ద్వారా 7లక్షల మంది ఉపాధి కూలీలకు 100రోజుల పనిదినాలు కల్పించాలని లక్షంగా నిర్ణయించారు. 
అక్కరకు వచ్చిన ఉపాధి హామీ పథకం

మే లో ఏజెన్సీలు, రీసోర్స్ పర్సన్లు, ఉపాధిహామీ పథకం సిబ్బంది, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసారు. ఈ శిక్షణ సమయంలోనే ఉపాధి కూలీల గుర్తింపు, గ్రామాల వారీగా జాబితా, నాటాల్సిన మొక్కల సంఖ్య, కూలీకయ్యే ఖర్చు(బడ్జెట్)పై నివేదిక తయారుచేసారు.ఏడాది పాటు క్యాలండర్‌ను ఇదివరకే రూపొందించి దానిని అమలుచేయడం ప్రారంభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది  జూలై నుంచి మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంలా చేపట్టనుంది.  ప్రస్తుతం మొక్కల పెంపకంపై గ్రామసభల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సభలను ఆగస్టు నెలంతా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన నిధుల్లో రూ.2062కోట్ల రూపాయలను జూన్‌లోనే విడుదల చేసింది.   వీటిలో 1172కోట్ల రూపాయలు వేతన నిధులు కాగా మరో 942కోట్ల రూపాయలను మెటీరియల్ కాంపొనెంట్ నిధుల కింద విడుదల చేసింది. ఈ నిధులతో పది కోట్ల పనిదినాలు కల్పించే పనిని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ వేగంగా పూర్తి చేస్తోంది. ఇది కాక హరితహారంలో భాగంగా గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే 8333గ్రామాలను ఎంపిక చేసి అక్కడ నర్సరీల కోసం భూసేకరణను కూడా పూర్తి చేసింది.ఈ నెలలో (ఆగస్టులో )మొక్కల పెంపకంపై గ్రామసభలు నిర్వహించడం మొదలుపెట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాల్సిన ప్రాంతాలు, వాటి పెంపకంపై తీసుకోవాల్సిన చర్యలను ఈ సభల్లో స్థానికుల తో చర్చించి వారి గ్రామాల్లో అనువైన మొక్కల పెంపకాన్ని నిర్ణయిస్తున్నారు.సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామసభల్లో మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పా టు తదితర అంశాలపై తీసుకున్న నిర్ణయాలపై పునఃపరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకు ని వాటిని ఖరారు చేయనున్నారు. మొక్కల పెంపకం కోసం తీసుకునే ప్రభుత్వ , ప్రైవేటు భూములు, నాటాల్సిన మొక్కలు, యంత్రాలతో పనిచేయాల్సిన అవసరముంటే వాటి వివరాలు, ఉపాధి కూలీలు పనిచేయాల్సిన రోజులు, చెల్లించాల్సిన కూలీ, యంత్రాలకు చెల్లించాల్సిన అద్దె వంటి వాటిపై అంచనాలు తయారు చేస్తారు. అనంతరం ఈ అంచనాలకు పరిపాలన అనుమతుల కోసం పంపించి అనుమతి తీసుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో అవసరమైన మొక్కలు తదితరలపై వర్క్ ఆర్డర్లు ఇస్తా రు. అనంతరం గ్రామాల వారీగా ఫీల్ట్ అసిస్టెంట్లు, ఉపాధిమేట్లతో పనులను ప్రారంభిస్తారు. మొక్కలు నాటాల్సిన భూముల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయిం చి ఏఏ భూముల్లో ఎలాంటి మొక్కలు నాటాలో నిర్ణయిస్తారు. ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదునుచేయడం, నీటి సరఫరా వంటి పనులు చేపడతారు. జనవరి, ఫిబ్రవరిలో ఈ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చిలో మొక్కల సంరక్షణ కోసం ఫెన్సింగ్ పనులను ప్రారంభిస్తారు.ఎప్రిల్‌లో మొక్కల నారు, ఎరువుల వం టివి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటిని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన తర్వాత  మట్టి నింపి నారు పెంచుతారు. నారు పెరిగే సమయంలోనే మరో వైపు నర్సరీ ల్లో, కార్యాలయాల్లో లబ్దిదారులకు కూడా శిక్షణ ఇస్తారు. జూ న్‌లో మొక్కలను అవి నాటే ప్రాంతాలకు తరలిస్తారు. జూలై నుంచి మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. మొక్కలు నాటడంతో పాటే వాటికి ఫెన్సింగ్ వంటి సంరక్షణ పనులు వెంటనే చేపడతారు. మొక్కల పెంపకంపై సంబంధిత లబ్దిదారులకు నెలనెల శిక్షణ ఇస్తారు. వాటి ని గ్రామాల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి వారం పరిశీలిస్తారు. మొక్కలు ఎండిపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం  వంటివి ఉంటే వెంటనే వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు. ఈ ప్రక్రియను 2019 డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. జూలైలో మొక్కలు నాటి డిసెంబర్ వరకు దాదాపు ఆరునెలల పాటు సంరక్షణ పర్యవేక్షణ పకడ్బంధీగా చేయాలని అధికారులు నిర్ణయించారు.