భారీగా వైద్యుల నియామకానికి శ్రీకారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీగా వైద్యుల నియామకానికి శ్రీకారం

అదిలాబాద్, ఆగస్టు 21, (way2newstv.com)
గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దశాబ్దకాలంగా కాంట్రాక్టు వైద్యులు... ఖాళీలతో నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ వైద్యులను నియమించి ప్రభుత్వం పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలను మరింత మెరుగ్గా అం దించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే రెగ్యులర్ ప్రాతిపదికన వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాజాగా ప్రభు త్వం జిల్లాలో 13 మంది రెగ్యులర్ వైద్యాధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీలు ఉండగా.. ఇప్పటివరకు కేవలం ఐదుగురు వైద్యులు మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తుండగా.. మిగతా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండేవి. 
భారీగా వైద్యుల నియామకానికి శ్రీకారం

కొన్నిచోట్ల మాత్రం కాం ట్రాక్టు వైద్యులతో ఇంతకాలం వైద్య సేవలను నెట్టుకొం టూ వస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగాలు కాకపోవడంతో కాంట్రాక్టు వైద్యులు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ఆసక్తిని చూపని కారణంగా గ్రామీణ ప్రజలకు ఆ శించిన స్థాయిలో సేవలందకపోయేవి. ప్రభుత్వం తాజా గా ఖాళీగా ఉన్న అన్ని పీహెచ్‌సీలల్లో రెగ్యులర్ వైద్యులను భర్తీ చేయడంతో జిల్లావ్యాప్తంగా ప్రాథమిక వైద్యం మరింత మెరుగుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. 15 చోట్ల వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేస్తూ చర్యలు తీసుకున్నది. అనేక అవాంతరాలు, కోర్టు కేసులను అధిగమించి ప్రభుత్వం వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో నూతన వైద్యాధికారులు ఆయా పీహెచ్‌సీల పరిధిలో బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఆ పీహెచ్‌సీలను వైద్య విధాన పరిషత్‌కు అప్పగించి కమ్యూనిటీ వైద్యశాలలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజా నియామకాల నేపథ్యంలో ఖాళీగా ఉన్న 13 పీహెచ్‌సీల్లో కొత్త వైద్యులను నియమించారు. మారుమూల ప్రాంతాలుగా ఉన్నచోట్లలో ఇద్దరేసి వైద్యులను నియమించగా.. ప్రతిచోట ఎక్కడ ఖాళీగా లేకుండా పీహెచ్‌సీలలో ఒక్కొక్క వైద్యున్ని ప్రభుత్వం నియమించింది.