విజయసాయి పాత్రలో సుజనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయసాయి పాత్రలో సుజనా

సేమ్ టూ సేమ్
న్యూఢిల్లీ, ఆగస్టు 24, (way2newstv.com)
క్యారెక్టర్లు మారాయి. నేతలు మారారు. కాని పంథా ఒక్కటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తీసుకుంటే మైండ్ గేమ్ మొదలయిందనే చెప్పాలి. అధికార పార్టీని అయోమయంలో పడేసి తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఇటు వైసీపీ, అటు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో హస్తినలో మైండ్ గేమ్ ఆడే పాత్రను విజయసాయి రెడ్డి సమర్థవంతంగా పోషించారు. అందుకే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.గతంలో మోదీ బలంగా ఉన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి హస్తినలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్రధాని కార్యాలయానికి నేరుగా వెళ్లిన వీడియో ఫుటేజీ బయటకు వచ్చింది. అలాగే వివిధ కేంద్ర మంత్రులనూ ఆయన తరచూ కలిసే వారు. 
 విజయసాయి పాత్రలో సుజనా

దీంతో వైసీపీకి ప్రధాన నరేంద్రమోదీ, బీజేపీ మద్దతు ఇస్తుందని చంద్రబాబు భావించారు. దాని ఫలితంగానే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మోదీపై తిరగబడ్డారు.అప్పట్లో విజయసాయిరెడ్డి పోషించిన పాత్రను ఇప్పుడు సుజనా చౌదరి తీసుకున్నట్లు కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా గెలిచిన సుజనా చౌదరి మూకుమ్మడిగా నలుగురుతో కలసి రాజ్యసభలో పార్టీని విలీనం చేయగలిగారు. బీజేపీకి పెద్దల సభలో అవసరం కావడంతో సుజనా బ్యాచ్ కి బీజేపీ వెల్ కమ్ చెప్పింది. అయితే బీజేపీ కండువా కప్పుకున్న సుజనా చౌదరి ఇప్పడు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. పోలవరం, అమరావతి వంటి వాటిపై ఆయన విమర్శలు చేస్తున్నారు. అమిత్ షా, మోదీ అనుమతితోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ను తొలుత ఖండించింది సుజనా చౌదరి.కేంద్ర ప్రభుత్వం పెద్దలు జగన్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత దీన్ని చెడగొట్టే బాధ్యతను సుజనా చౌదరికి చంద్రబాబు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ తనంతట తానుగానే మోదీ సర్కార్ కు శత్రువుగా మారాలి. అందుకే కేంద్రమంత్రులను సుజనా చౌదరి కలిసి జగన్ సర్కార్ పై ఫిర్యాదు చేస్తున్నారు. పోలవరం రీటెండర్లు, పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా సుజనా చౌదరి హస్తినలో తీవ్ర స్థాయిలోనే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మాదిరిగానే సుజనా చౌదరి మైండ్ గేమ్ మొదలు పెట్టారన్నది వాస్తవం.