22 నాటికి సైరా ఈవెంట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

22 నాటికి సైరా ఈవెంట్

హైద్రాబాద్, సెప్టెంబర్ 17, (way2newstv.com)
సైరా నరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ తో పాటుగా ట్రైలర్ రిలీజ్ వేడుకని కూడా గొప్పగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అతి రథమహారధుల మధ్యన చేయ తలపెట్టిన విషయం విదితమే. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఈవెంట్లలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే సినిమాకి భారీ హైప్ తెచ్చేందుకు ప్లాన్ చెయ్యడమేకాదు… 
 22 నాటికి సైరా ఈవెంట్

18 న ఈ ఈవెంట్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ కూడా చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడినట్లుగా సమాచారం అందుతుంది.18 బుధవారం వర్కింగ్ డే అవడంతో.. ఇలాంటి ఈవెంట్ ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చెయ్యడం పెద్ద సవాల్ తో కూడుకున్న పని కావడంతో.. ఈ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు, ప్రజలు లక్షలాదిగా తరలి రావడం జరుగుతుంది. అలాగే రాగల రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించడంతో.. ఇప్పుడు సై రా టీం ఈ ప్రీ రిలీజ్ వేడుక డేట్ ను మార్చనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల  22న కానీ ప్లాన్ చెయ్యొచ్చంటున్నారు. ఇంకా సై రా ఈవెంట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.