తెలంగాణలో సై ప్రజా దర్బార్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో సై ప్రజా దర్బార్

హైద్రాబాద్, సెప్టెంబర్ 17, (way2newstv.com)
తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను చాలా మంది మెచ్చుకుంటారు. అదే సమయంలో... అదే చాలా మందిలో చాలా మంది... కేసీఆర్ అందుబాటులో ఉండరనీ, సెక్రటేరియట్‌కి రాకుండా ఎంతసేపూ ఫామ్‌హౌస్‌లోనో, ప్రగతిభవన్‌లోనో ఉంటున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని పట్టేసిన కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని కంప్లైంట్ చేశారు. అందువల్ల తాను రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలనుకుంటున్నానని అనేశారు. ఐతే... ఇక్కడ గవర్నర్ ఓ రాజకీయ ఎత్తుగడ వేశారని అనుకోవచ్చు. ఎలాగంటే ఆమె డైరెక్టుగా ప్రజాదర్బార్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకోలేదు. 
తెలంగాణలో సై ప్రజా దర్బార్

MBT నేత అమ్జదుల్లాఖాన్ ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆమెను ట్వీట్ ద్వారా కోరగా ఆమె ఓకే అన్నట్లు స్పందించారు.నిజానికి తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసైని నియమించినప్పుడే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తమిళిసై బాధ్యతలు స్వీకరించిన రోజే... మంత్రివర్గాన్ని విస్తరించి... కేబినెట్‌లో తొలిసారి ఇద్దరు మహిళలకు ఛాన్స్ ఇచ్చారు. తద్వారా కేబినెట్‌లో మహిళా నేతలు లేరన్న విమర్శలకు చెక్ పెట్టారు. ఐతే... తమిళిసై... కేసీఆర్ అందుబాటులో ఉండట్లేదన్న అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా... బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక రకంగా టీఆర్ఎస్‌ని గద్దె దించేందుకు... గవర్నర్ వచ్చాక బీజేపీ వేసిన తొలి ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని గద్దె దించడంలో బీజేపీ ఇప్పటికే ఆరితేరిందన్న వాదన ఉంది. ఐతే... నల్లమలలో యురేనియం మైనింగ్‌ అంశంపై కేంద్రానికి టీఆర్ఎస్ ఎదురు తిరగడం ద్వారా రాష్ట్ర ప్రజల మద్దతు పొందినట్లైంది. ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గకపోతే... తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూడక తప్పదు. అందువల్ల కేసీఆర్... ఈ విషయంలో అత్యంత తెలివిగా పావులు కదిపారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే... తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బజేపీ ఆల్రెడీ మొదలై... రోజురోజుకూ అది తీవ్రమవుతున్నట్లే కనిపిస్తోంది