అమరావతి సెప్టెంబర్ 14, (way2newstv.com)
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్గాశనివారం సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయపరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చి, దీన్ని అమలు చేయడానికి ఒక న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
జస్టిస్ శివశంకరరావు బాధ్యతల స్వీకరణ
విదేశాల్లో కూడా ఈ తరహా విధానం ఎక్కడా లేదనివెల్లడించారు. లోకకళ్యాణం కోసం మనమంతా జీవించాలని, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. హక్కుల కోసం పోరాడేవారు బాధ్యతగా ఉండాలని.. కర్మబద్దంగా.. ధర్మబద్దంగాఅందరూ పని చేయాలని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జస్టిస్ శివశంకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎం జగన్ను కలిసిన లక్ష్మణ్ రెడ్డి : తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రలోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.