అక్కరకు వస్తున్న టెక్నాలజీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్కరకు వస్తున్న టెక్నాలజీ

డ్రోన్ల సాయంతో చీడ, పీడల గుర్తింపు
మెదక్, సెప్టెంబర్ 21, (way2newstv.com)
రైతులకు పెట్టుబడి పెరగడానికి గల కారణాలు ఏంటీ... ? ఎక్కడ ఖర్చు పెరుగుతుందన్న విషయాలపై అన్వేషణ మొదలు పెట్టాడు. దీనికి మోతాదు మించి అధిక ఎరువులను వినియోగించటం ద్వారా పెరుగుతున్న ఖర్చులు మరియు రైతుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యువ ఇంజనీర్ సందీప్ రెడ్డి రెండు రకాల డ్రోన్ లను మన తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.  వ్యవసాయ కుటుంబంలో రైతు బిడ్డగా వారి సమస్యలు తెలిసిన వ్యక్తి సందీప్ రెడ్డి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. అందరి లాగే సాప్ట్ వేర్ రంగంలో ముందుకు వెళ్లారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసారు. అక్కడే పుట్టింది అసలలైన ఆలోచన రైతులకు ఎరువుల పిచికారికి ఉపయోగపడే విధంగా మన దేశంలో ఈ డ్రోన్ టెక్నాలజీని అభివృధ్థి చేయాలనుకున్నాడు. 
అక్కరకు వస్తున్న టెక్నాలజీ

కేవలం పంటలపై పిచికారీ చేయటమే కాదు పంటకు వచ్చిన చీడ పీడల్ని గుర్తించే డ్రోన్ ని కూడ పరిచయం చేస్తున్నాడు. దీనినే తనిఖీ డ్రోన్ అని అంటారు.తనకు వచ్చిన ఈ ఆలోచనకు తోడుగా ఈ టెక్నాలజీ పైన ఆశక్తి వున్న యువకులను ఎంపిక చేసుకున్నాడు. అందులో యువ ఇంజనీర్లు మరియు అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారిని ఎంపిక చేసుకొన్నారు. పంటకు వస్తున్న తెగుళ్లు మరియు వాటి నివారణకు పిచికారి చేసే ఈ రెండు టెక్నాలజీలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లడానికి సిధ్దమయ్యారు. క్రిష్టల్ బాల్ సంస్థ పేరుతో నెలకొల్పిన ఈ సంస్థకు సంభందించి డ్రోన్ టెక్నాలజీని కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు ఎఫ్ ఈ ఓ లకు కూడ ఈ టెక్నాలజీని తెలియ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల గ్రామీణ యువతకు మంచి ఉపాధి దొరుకుతూ రైతులకు మేలు కలుగుతుందని అంటున్నారు. పంటకు ఎలాంటి చీడ పీడలు వస్తున్నాయన్న విషయయాన్ని గమనిస్తే వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే ముందుగా పంటపై డ్రోన్ తిరుగుతూ పైనుండి పోటోలను చిత్రీకరిస్తుంది. అందు కోసం అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కెమరాలు పని చేస్తాయి. వీటిని మొబైల్ లో ముందుగా మన పంట విస్తీర్ణాన్ని జీపీఎస్ టెక్నాలజీతో మ్యాపింగ్ ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం వుంటుంది. అప్పుడు మనం ఎంచుకున్న ప్రాంతంలో మాత్రమే డ్రోన్ తిరుగుతుంది. దాదాపు మొక్క నుండి 60 మీటర్ల ఎత్తు వరకు ఫోటోలను చిత్రికరించే శక్తి ఈ టెక్నాలజీకి వుంది. 50 ఎకరాల విస్తీర్ణాన్ని కూడ ఒకే మ్యాప్ లో చూపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం డ్రోన్ లో తనిఖీ చేసే పధ్దతి మాత్రం చూసాం ఈ తనిఖీలో వచ్చిన పోటో రిపోర్ట్ ఆధారంగా వాటికి ఎరువులను పిచికారి చేసేందుకు ఈ రెండవ డ్రోన్ పని చేస్తుంది. దీన్ని కూడ జీపిఎస్ పధ్దతిలో మ్యాపింగ్ చేసి పంటలపై పిచికారీ చేస్తుంది. కేవలం ఎక్కడైతే పంట తెగుళ్ళ సమస్య వస్తుందో అక్కడ మాత్రమే ఎరువులను పిచికారి చేయటం వల్ల సమయం, డబ్బు వృధా అవుకుండా రైతుకు ఉపయోగకరంగా వుంటుంది. వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ లాంటి దేశాలు టెక్నాలజీ వాడుకొని అభివృధ్ది చెందుతున్నాయి. అదే రీతిలో మన దేశంలో కూడ కొత్త టెక్నాలజీలు రావటం వల్ల రైతులకు లాభాలు పెరుగుతాయి. లక్ష్మాపూర్ లోని తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఢ్రోన్ లతో పిచికారి చేసారని రైతులు అనారోగ్య పాలు కాకుండా ఈ డ్రోన్ లు పత్యామ్నాయంగా దోహాదపడతాయని రైతులు అంటున్నారు.