మిడ్ డే మీల్స్ లో మారిన మెను.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మిడ్ డే మీల్స్ లో మారిన మెను....

ఒంగోలు, సెప్టెంబర్ 21, (way2newstv.com)
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఈ పథకానికి కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తున్నాయి. ఇక 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. గతేడాది వరకు ప్రాథమిక తరగతుల ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.35 విడుదల చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం రూ.4.48 చెల్లిస్తారు. ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థికి రూ.6.51 నుంచి రూ.6.71 వరకు పెంచారు. 9,10 తరగతుల విద్యార్థులకు రూ.6.51 నుంచి రూ.6.71 పెంచుతున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. 
 మిడ్ డే మీల్స్ లో మారిన మెను....

బడి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచింది. మార్కెట్‌లో పెరిగిన నిత్యావసర సరుకులు, ఆకు కూరలు, కూరగాయలు నేపథ్యంలో పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని నిర్వాహకులు వడ్డించలేకపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బడి పిల్లల భోజనంలో రాజీ పడకూడదని రాష్ట్ర వాటాను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్వాహకులు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే అవకాశం ఉంది.ప్రభుత్వ పాఠశాలల్లో బడి తోటల పెంపకం చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించ వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. బడి తోటల్లో పెంచే కూరగాయలు, ఆకు కూరల వల్ల  నిర్వాహకులకు కొంత వరకు ఖర్చు తగ్గుతుందనేది మరో కారణం. దీనికి తోడు విద్యార్థులకు పెరటి సాగుపై అవగాహన కల్పించే వీలు ఉంటుందని భావిస్తున్నారు