నెల్లూరు, సెప్టెంబరు 13 (way2newstv.com)
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిఇతరులు పాల్గోన్నారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం సుభిక్షంగా వుండాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టారు.
రోట్టెల పండుగలో మంత్రులు
అనంతరం మంత్రి మేకతోటి సుచరిత పోలీసుకమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి, నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగకు వచ్చేభక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డిగిరిధర్ రెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎం.డి. ఖలీల్ అహ్మద్, సమీ, దర్గా కమిటీ చైర్మన్ అబ్దుల్ రజాక్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, తదితరులు పాల్గొన్నారు.