జల ‘శక్తి’ కావాలి (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జల ‘శక్తి’ కావాలి (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 13 (way2newstv.com): 
రైతుకు కష్టం తెలుసు, భూమి విలువ కూడా తెలుసు. కష్టపడితే ఏ భూమిలోనైనా బంగారు పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారుమండలంలోని లీమ్‌గూడ, గిరిగామ్‌ గ్రామాల రైతులు. రాతి భూమిలో పత్తి, జొన్న, మినుము, పెసర, కంది పంటలను సాగుచేస్తున్నారు. వర్షాలు పంటలకు అనుకూలంగా కురిస్తే ఏడాదంతా గుట్టలుఎక్కుతూ దిగుతూ పంటలను సాగు చేసుకొంటున్నారు. లీమ్‌గూడ సమీపంలోని గుట్ట పైన దాదాపు 200 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ గుట్టపైన రాళ్లల్లో పంటలు పండుతాయంటే ఎవరైనాఆశ్చర్యపోతుంటారు. కానీ గిరిగామ్‌, లీమ్‌గూడ గ్రామాల రైతులు (24 మంది) మాత్రం వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఇక్కడా పంటలను పండించగలమని నిరూపిస్తున్నారు. 
జల ‘శక్తి’ కావాలి  (మహబూబ్  నగర్)

గిరిజన రైతులే ఎక్కువగా ఈభూములు సాగు చేస్తున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూమిని కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఏటా వర్షాధారంగా పత్తి, జొన్న, కంది, పెసర, మినుము పండిస్తున్నారు. కొన్నేళ్లుగా రైతులుభూముల్లోని రాళ్లు, ముళ్ల పొదలు తొలగిస్తూ చదును చేసుకుంటూ సాగుకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. పత్తి ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందనిలీమ్‌గూడ రైతులు పేర్కొన్నారు. లీమ్‌గూడ, గిరిగామ్‌ రైతులు పంటలు పండిస్తున్నా నిత్యం గుట్టపైకి ఎక్కడానికి అవస్థలు పడుతున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికిడ్రమ్ములను ఇతర వ్యవసాయ సామగ్రిని పైకి తీసుకెళ్లడానికి చేతికొచ్చిన పంట ఉత్పత్తులు ఇంటికి తీసుకురావడానికి అనేక తంటాలు పడుతున్నారు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు,కూలీలు సాయంత్రం వరకు అక్కడే ఉండి, వ్యవసాయ పనులు పూర్తి చేసుకుంటారు. ఉపాధిహామీ పథకం కింద భూములను బాగు చేయించడంతో పాటు రహదారులను నిర్మింపజేయాలని రైతులుకోరుతున్నారు. జలశక్తి అభియాన్‌ కింద గుట్టపైన భూముల్లో నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని లీమ్‌గూడ, గిరిగామ్‌కు చెందిన రైతులు కోరుతున్నారు.  రైతులకు ఎలాంటి భూమి ఉన్నాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్‌ సమ్మాన్‌, రైతుబంధు పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే ప్రకారం నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎకరానికి రూ.8 వేలు జమ చేస్తే, ఈసారి రూ. 10 వేలు చొప్పున ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఏడాదికి రూ. 6 వేలు వస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బంది లేదనిరైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.