రివర్స్ టెండరింగ్ తో బాబు అవినీతి బట్టబయలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రివర్స్ టెండరింగ్ తో బాబు అవినీతి బట్టబయలు

అమరావతి సెప్టెంబర్ 26, (way2newstv.com)
రివర్స్ టెండరింగ్ ప్రకియ వల్ల చంద్రబాబు నాయుడు అవినీతి సాక్ష్యాధారలతో సహా బయటపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాపైవ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతంసాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా.. బాబు. టెండర్లలో పాల్గొనద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట. 
రివర్స్ టెండరింగ్ తో బాబు అవినీతి బట్టబయలు

మరి ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారు’ అంటూ విజయ్సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరంలో మూడు పనులకే ఇప్పటి వరకుటెండర్లు పూర్తయ్యాయని.. 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయని విజయ్సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు బానిసలు చూడాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్సాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘పోలవరంలో మూడు పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు బానిసలు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లుఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయి.ప్రజా ధనాన్ని ఇంత విచ్చల విడిగా, పబ్లిగ్గా దోచుకోవడం ఎక్కడా కనబడదు’ అంటూ విజయ్సాయి రెడ్డిఆరోపించారు.