పారిశ్రామిక సంస్థలో పేలుడు…ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 26, (way2newstv.com)
వరంగల్ అర్బన్ జిల్లాలో గురువారం జరిగిన ఒక  పేలుడు సంఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ధర్మసాగర్ మండలంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఉంది. రాంపూర్లో వజ్రాకు సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం నాడు రోజు లాగా సిబ్బంది పనులకు హజరయ్యారు. కొద్దిసేపటికే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. గాయాలపాలైన వారిని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 
 పారిశ్రామిక సంస్థలో పేలుడు…ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు

చి చికిత్స అందిస్తున్నారు. తమకు ఏం జరిగిందో తెలియదని మహిళా కార్మికురాలు తెలిపారు. తనకు గాయాలు కాగా..చెల్లి కాలుతీసివేశారని విలపిస్తూ చెప్పింది. బండలు కడిగే బ్రిక్స్ తయారవుతాయని వెల్లడించింది. గాయాలపాలైన వారిలో నాయినీ రజిత, నాయినీ స్వరూప, ప్రియాంకలున్నారు. స్వరూప కాలుపూర్తిగా తెగిపోయింది. ప్రియాంక కు కాలిన గాయాలయ్యాయి. బాధితుల కుటుంబాలు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.
Previous Post Next Post