ఇంకా కేసుల ఉచ్చులో టీడీపీ నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంకా కేసుల ఉచ్చులో టీడీపీ నేతలు

కర్నూలు, సెప్టెంబర్ 27, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ ఒక పక్కన మమ్మల్ని టార్గెట్ చేసారు, రాజకీయంగా వేధిస్తున్నారు అని ఆరోపిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం, రాజకీయ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కోడెల, చింతమనేని, కూన రవి కుమార్, సోమిరెడ్డి, ఇలా అనేక మంది సీనియర్ నేతల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇవేమన్నా అవినీతి కేసులు, మర్డర్ కేసులా అంటే, రాజకీయ ప్రేరేపితమైన ఎస్సీ ఎస్టీ కేసులు. ఇందులో అరెస్ట్ చేస్తే, బెయిల్ తొందరగా రాదనీ, ఈ సెక్షన్ వాడి, తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ ను, ఇదే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేసారు. ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పై, అదే ఎస్సీ ఎస్టీ కేసు వాది, అరెస్ట్ చేసారు. అది కూడా 2014లో కేసును తిరగదోడి, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి, తీసుకువెళ్ళారు. 
ఇంకా కేసుల ఉచ్చులో టీడీపీ నేతలు

ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీస్ కూడా ఇవ్వకుండా, ఒకేసారి వచ్చి తీసుకు వెళ్ళిపోయారు.కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న డి.విష్ణువర్ధన్‌రెడ్డిని నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో 2014లో ఆయన పై ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదును, ఇప్పుడు తిరగదోడి వచ్చి అరెస్ట్ చేసారు. ఆ ఫిర్యాదు మేరకు, విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు బుధవారం స్థానిక ప్రకాశ్‌నగర్‌లోని స్వగృహంలో ఉన్న ఆయన ఇంటికి ఒకేసారి వచ్చి, అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కర్నూలు టు టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన్ చేపట్టాయి. . కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. "తెలుగుదేశం నాయకులను వైసిపి టార్గెట్ చేయడంపై మండిపాటు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆత్మకూరులో 150దళిత కుటుంబాలను నెలల తరబడి గ్రామ బహిష్కారం చేసినా చర్యలు లేవు. వారి తరఫున పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే టిడిపి నేతలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా దారుణం ఇంకోటి లేదు. టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 12మందిపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడిపై ఒకే అంశంపై తాడేపల్లిలో, టెక్కలిలో 2కేసులు పెట్టారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ,ఎస్టీ అక్రమ కేసు బనాయించారు. 43ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. బెందాలం అశోక్, బాల వీరాంజనేయ స్వామి, కరణం బలరామ్, కూన రవికుమార్ తదితరులపై అక్రమంగా కేసులు పెట్టారు. కుటుంబరావు భూమి 37ఏళ్ల అంశంపై సుప్రీంకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలున్నా ప్రహరీగోడలు కూల్చేశారు. 19 తప్పుడు కేసులు పెట్టి కోడెలను బలితీసుకున్నారు. వైసిపి ప్రభుత్వ వేధింపులకు అంతేలేకుండా పోయింది. వైసిపి నేతల అరాచకాలను ప్రజలే నిరసించాలి. మేధావులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వీళ్ల ఆగడాలను ఖండించాలి." అని చంద్రబాబు అన్నారు.