చంద్రయాన్ లో విక్రమ్ మిస్సింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రయాన్ లో విక్రమ్ మిస్సింగ్

48 రోజుల పాటు సజావుగా సాగిన ప్రయాణం
2.1 కిలోమీటర్ల దగ్గర నిలిచిన సిగ్నల్స్
ఇస్రో సైంటిస్టులకు మద్దతుగా నిలిచిన భారత్
బెంగళూర్, సెప్టెంబర్ 7, (way2newstv.com)
చ‌ంద్ర‌యాన్‌2 అంతా సాఫీగా సాగింది. కానీ ఇంకా 2.1 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌డం ఆగిపోయాయి. దీంతోనే ఇస్రోలో టెన్ష‌న్ నెల‌కొన్న‌ది. శాస్త్ర‌వేత్త‌లు  డేటాను ప‌రిశీలిస్తున్నారు. కానీ సైంటిస్టుల‌ ముఖాల్లో చిరున‌వ్వులు క‌నిపించ‌లేదు. ప్ర‌ధాని మోదీతో పాటు ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌, మ‌రో ముగ్గురు మాజీ ఇస్రో చీఫ్‌లు కూడా ఆప‌రేష‌న్‌ను వీక్షించారు. కానీ వారు కూడా ఎక్క‌డా చిరున‌వ్వుల‌ను త‌మ ముఖంలో చూపించ‌లేదు. దీంతో విక్ర‌మ్‌కు ఏమైంద‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అత్యంత క్లిష్ట‌మైన 15 నిమిషాల ప్ర‌క్రియ‌ను ల్యాండ‌ర్ దాదాపు పూర్తి చేసుకునే స‌మ‌యంలో విఘాతం ఎదురైంది. 
.చంద్రయాన్ లో విక్రమ్ మిస్సింగ్

చంద్రుడి ఉప‌రిత‌లానికి 2.1 కిలోమీట‌ర్ల ఆల్టిట్యూడ్ వ‌ర‌కు విక్ర‌మ్ స‌జావుగా ప‌నిచేసింద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ తెలిపారు. కానీ ఆ త‌ర్వాతే ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్ మిస్సైన‌ట్లు ఆయ‌న చెప్పారు. డేటాను ప‌రిశీలిస్తున్నామ‌ని శివ‌న్ చెప్పారు. అయితే డేటాను ప‌రిశీలించిన త‌ర్వాతే మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు ఇస్రో మీడియా సెంట‌ర్‌లో శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అధికారిక మీడియా స‌మావేశాన్ని కూడా ఇస్రో ర‌ద్దు చేసింది.చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడిందిచంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి... గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఐతే స్పీడ్ కంట్రోల్ కాక విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిందా? లేదంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాక సిగ్నల్స్ నిలిచిపోయాయా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు డేటా విశ్లేషణ చేస్తున్నారు. ఇస్రో జులై 22న చంద్రయాన్-2ను ప్రయోగించగా.. సెప్టెంబర్ 7న చందమామ మీద దిగుతోంది. 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై మీద అడుగుపెడుతోంది. 1959లో సోవియట్ రష్యా పంపిన లూనా-2 క్రాఫ్ట్ 34 గంటల్లోనే చంద్రుడి మీద అడుగుపెట్టింది. 1969లో నాసా ప్రయోగించిన మానవసహిత వ్యౌమనౌక అపోలో-11 నాలుగు రోజుల 6 గంటల 5 నిమిషాల్లో చందమామపై అడుగుపెట్టింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగింది. మరి చంద్రయాన్-2 చందమామను చేరడానికి 48 రోజులు ఎందుకు పట్టిందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.రాకెట్ నిర్మాణం, అవసరమయ్యే ఇంధనం పరిమాణం, లూనార్ క్రాఫ్ట్ స్పీడ్ అనేవి దీనికి ప్రధాన కారణాలు. అంతరిక్షంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే.. అత్యంత వేగం, విక్షేప మార్గం అనేవి ఎంతో ముఖ్యం. అపోలో-11 ప్రయోగం కోసం శాటర్న్ 5 అనే సూపర్ హెవీ లిఫ్ట్ లాంచర్‌ను నాసా వాడింది. ఇది గంటలకు 39 వేల కి.మీ. కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. అత్యంత బలమైన రాకెట్ 43 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.వ్యోమగాములను మోసుకెళ్లిన అపోలో-11 మిషన్‌ కోసం లాంచర్, లాంచర్ క్రాఫ్ట్‌లకు శక్తవంతమైన ఇంజిన్లు వాడారు. ఇందుకోసం నాసా 1969లోనే 185 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. 2016 లెక్కల ప్రకారం చూస్తే ఈ ఖర్చు విలు 1.2 బిలియన్ డాలర్లు. ప్రస్తుతమైతే ఇది 8600 కోట్ల రూపాయలకు సమానం. 185 మిలియన్ డాలర్లలో 110 మిలియన్ డాలర్లు కేవలం శాట్నర్ 5 కోసమే ఖర్చు చేసింది.చంద్రయాన్‌-2 కోసం ఇస్రో తెలివిగా వ్యవహరించింది. ఖర్చును తగ్గించుకోవడం కోసం భూమి గురుత్వాకర్షణ శక్తిని అనుకూలంగా మలుచుకుంది. చంద్రయాన్-2 ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను ఇస్రో ఉపయోగించింది. ఇది గరిష్టంగా 4 టన్నుల బరువు మాత్రమే మోయగలదు. 3.8 టన్నుల బరువైన చంద్రయాన్-2ను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టడం వరకు మాత్రమే  జీఎస్ఎల్వీ ఎంకే 3పరిమితం. అక్కడి నుంచి చంద్రయాన్-2 తనంతట తాను ప్రయాణించి చంద్రుడిని చేరుకోవాలి.వాహక నౌక చంద్రుణ్ని చేరుకోవడానికి సెకనుకు 11 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. ఇందులో 1.03 కి.మీ/సెకన్ వేగం వాహక నౌక, 700 మీ/సెకన్ వేగాన్ని క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్ అందిస్తాయి. శాట్నర్ 5 తరహాలో పవర్‌ఫుల్ ఇంజిన్ వాడితే ఒకే షాట్‌లో చంద్రయాన్‌-2 కూడా చంద్రుణ్ని చేరేది. దీనికి ఇంధనం కూడా భారీగా అవసరం. ఖర్చును తగ్గించడం కోసం, గురుత్వాకర్షణ శక్తిని వాడుతూ చంద్రయాన్-2 ప్రయాణం సాగింది.ఇస్రో ప్రయోగించిన మిషన్ భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, క్రమంగా తన అపోజీని పెంచుకుంటూ వెళ్లింది. భూ కక్ష్య నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చంద్రుడి దిశగా దూసుకెళ్లింది. ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత.. చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ.. మెల్లగా తన అపోజీని తగ్గించుకుంది. చివరగా చంద్రుడి మీద దిగుతుంది.ఈ వ్యూహం వల్ల చంద్రయాన్-2 కోసం ఇస్రో రూ.978 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. ఇందులో రూ.375 కోట్లు జీఎస్ఎల్వీ రాకెట్ నిర్మాణం కోసమే ఖర్చు పెట్టారు. శాట్నర్ 5 కోసం నాసా చేసిన ఖర్చుతో పోలిస్తే.. ఇస్రో చేసిన ఖర్చు చాలా తక్కువనమాట.ఇస్రో  జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను బాహుబలిగా అబివర్ణిస్తుంది. మూడు దశల ఈ రాకెట్ 43.4 మీటర్ల ఎత్తుతో, 641 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4 టన్నుల బరువు మోసుకెళ్తుంది. నాసా వాడిన శాట్నర్ 5 రాకెట్ 111 మీటర్ల ఎత్తుతో 2950 టన్నుల బరువు ఉంటుంది. అది 140 టన్నుల బరువు మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ 43 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది.దేశం గర్విస్తోంది... ఇస్రోతోనే భారత్ ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల ప‌ట్ల దేశం గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డంతో ఇస్రో సెంట‌ర్‌లో టెన్ష‌న్ నెల‌కొన్న‌ది. ఆ స‌మ‌యంలో మోదీ.. అక్క‌డ ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడారు. మీది చిన్న అచీవ్‌మెంట్ కాద‌న్నారు. మీ కృషి ఎంతో నేర్పిందన్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మాన‌వ‌జాతికి ఉత్త‌మ‌ సేవ‌చేశార‌న్నారు. చాలా దిగులుగా క‌నిపించిన శాస్త్ర‌వేత్త‌ల్లో మోదీ జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. నేను మీవెంటే ఉంటాన‌ని ఆయ‌న వారికి హామీ ఇచ్చారు. ధైర్యంతో ముంద‌కు వెళ్దామ‌న్నారు. మ‌ళ్లీ మ‌రికొన్ని ప్ర‌య‌త్నాల‌తో ముందుకు వెళ్దాం అన్నారు. ఆల్ ద బెస్ట్ అని మోదీ తెలిపారు. మిష‌న్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన విద్యార్థుల‌తోనూ మోదీ మాట్లాడారు. విద్యార్థులు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డంతో.. శాస్త్ర‌వేత్త‌ల్లో తీవ్ర నిరాశ నెల‌కొన్న‌ది. అయితే శాస్త్ర‌వేత్త‌ల్లో మ‌నోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండింగ్ ప్ర‌క‌ట‌న ఆల‌స్యం కావ‌డంతో అంతటా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. యావ‌త్ దేశం ఇస్రో వెంటే ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. మీ క‌ఠోర శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశాయ‌ని కాంగ్రెస్ త‌న ట్వీట్‌లో తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా త‌న ట్వీట్‌లో రియాక్ట్ అయ్యారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అండ‌గా ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌తి ఒక‌రిలోనూ మీరు అంత‌రిక్ష అవ‌గాహ‌న పెంచిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. భ‌విష్య‌త్తు ప్ర‌యోగాల కోసం బెస్ట్ విషెస్ చెప్పారాయ‌న‌చంద్రుడి కాల ప్ర‌మానం ప్ర‌కారం దాని ఉప‌రిత‌లంపై ఒక రోజు పని చేస్తుంది. అంటే అది భూమిపై 14 రోజుల‌తో స‌మానం. ఆ స‌మ‌యంలో రోవ‌ర్ ప‌లు ప‌రీక్ష‌లు చేప‌డుతుంది. కానీ ప్ర‌జ్ఞాన్‌ లో ఉన్న ప్ర‌ధాన ఆర్బిట‌ర్ మాత్రం క‌నీసం ఏడాది పాటు వివిధ అధ్య‌య‌నాలు చేయ‌నున్న‌ది. ల్యాండ‌ర్‌, రోవ‌ర్‌లు.. దేశానికి చెందిన చిహ్నాల‌ను మోసుకువెళ్తున్నాయి. అవి శాశ్వ‌తంగా అక్క‌డే ఉండ‌నున్నాయి. రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌ కు మొత్తం ఆరు వీల్స్ ఉన్నాయి. రెండు దిక్కుల మూడేసి వీల్స్ ఉంటాయి. ఒక చ‌క్రంపై అశోక చ‌క్ర చిహ్నం ఉంటుంది. మ‌రోవైపు ఉన్న వీల్స్‌పై ఇస్రో చిహ్నం ఉంటుంది. అయితే రోవ‌ర్ దిగే ల్యాండ‌ర్ ర్యాంప్‌పై జాతీయ జెండా ఉంటుంది.