తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ' రోడ్ కమ్ రివర్ క్రూజ్ ' టూర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ' రోడ్ కమ్ రివర్ క్రూజ్ ' టూర్

హైదరాబాద్, సెప్టెంబర్ 7, (way2newstv.com)
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన ' రోడ్ కమ్ రివర్ క్రూజ్ ' టూర్ లో భాగంగా హైదరాబాద్ నుండి పర్యాటకులను తీసుకెళుతున్న తొలి బస్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, M D మనోహర్, టూరిజం అధికారులు వేణు, గుండూరి వెంకటేశ్వర్లు,రాజలింగం, పురెందర్, నేత్ర, జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు.నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు రివర్ క్రూజ్ లో జలమార్గం నుండి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీని రూపొందించమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ' రోడ్ కమ్ రివర్ క్రూజ్ ' టూర్

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో ఉన్న పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ప్రపంచంలో గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం సందర్శనం కోసం రూపొందించిన టూర్ ప్యాకేజీ కి పర్యాటకుల నుండి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అదే స్పూర్తితో నాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు రివర్ క్రూజ్ ద్వారా ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు, కృష్ణా నది నీటిలో ప్రయాణానికి తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్యాకేజీ ని అతి తక్కువ ధరలలో పర్యాటకులకు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సంధర్భంగా పర్యటన కు వెళుతున్న పర్యాటకులతో మంత్రి మాట్లాడారు. పాపికొండల కంటే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఇక్కడ ఉందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ప్యాకేజీ లో పర్యాటకులకునాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన తో పాటు సోమశిల, కొల్లాపూర్ ల నుండి శ్రీశైలం వరకు విడిగా రివర్ క్రూజ్ ప్యాకేజీని రూపొందించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతాల పథకము సందర్శన సందర్భంగా  కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో రూపొందిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాంతం  అద్భుత పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని సూచించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు కూడా త్వరలో  పర్యాటకులకు టూర్ ప్యాకేజీ ని అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.