రబీకి రెడీ అవుతున్న రైతాంగం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రబీకి రెడీ అవుతున్న రైతాంగం

తిరుపతి, సెప్టెంబర్ 25, (way2newstv.com)
చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి. అక్టోబరు నుంచి రబీ సీజన్‌ ప్రారంభం అవుతుండగా.. ముందుగానే పలుచోట్ల రైతులు దుక్కులు దున్నుతుండగా.. కొన్నిచోట్ల వరినారు పోస్తున్నారు.శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాలతో పాటు తమిళనాడు సరిహద్దు గ్రామాల రైతులు వరి సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ మంది స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఎడీటీ 37 తదితర రకాలను సాగు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తిరుపతి, చంద్రగిరి తదితర ప్రాంత రైతులు దీర్ఘకాలిక రకాలైన ఎన్‌ఎల్‌ఆర్‌33892, సీఆర్‌1009, బీపీటీ 5204 రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. రైతుల ఆసక్తి దృష్ట్యా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆయా రకాలైన నాణ్యమైన వరి వంగడాలను అందుబాటులోనికి తీసుకువచ్చింది. 
రబీకి రెడీ అవుతున్న రైతాంగం

ప్రస్తుతం ముందస్తు రబీ సీజన్‌ దృష్ట్యా ఏపీసీడ్స్‌లో విత్తన విక్రయాలు జోరందుకున్నాయి.జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 69,644 హెక్టార్లుగా ఉంటే.. ఎక్కువ భాగం తూర్పు మండలాల్లోనే పంటలు సాగవుతుండటం విశేషం. ప్రధానంగా రైతులు వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ఈ సీజన్‌లో వరి పంట ఒక్కటే దాదాపు 39,869 ఎకరాలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ భావిస్తోంది.తూర్పు ప్రాంతంతో పాటు పశ్చిమ మండలాల్లోనూ ఇటీవల వర్షాలు  కురుస్తున్నాయి. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకుల సూచన మేరకు ఏపీసీడ్స్‌ ఉలవలను అందుబాటులోనికి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇక్కడి విత్తనాభివృద్ధి సంస్థ కేంద్రం నుంచి 25 వేల క్వింటాళ్ల ఉలవలు వంద శాతం రాయితీతో పశ్చిమ మండలాల రైతులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది.వరి ఆశలు అవిరిఆగస్టు నెలాఖరులోగానైనా వర్షం పడకపోతుందా అని ఎదురు చూసిన రైతన్నకు చివరి ఆశలూ గల్లంతయ్యాయి. వరుణుడు వర్షించక, చెరువుల్లో నీరు లేక పొలాలన్నీ బీడుగా మారడంతో రైతన్న గుండె చెరువవుతోంది. కళ్లెదుటే నారు ముదిరిపోతున్నా, ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గత ఖరీఫ్‌, రబీ పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు వాటి నుంచి కోలుకోకముందే మరోసారి వర్షాభావం వెంటాడుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లోనూ ఇంత వరకు 40శాతం నాట్లు కూడా పడకపోవడంతో ఈసారి కూడా జిల్లాలో దుర్భిక్షం నెలకొందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందిన విజయనగరం కరువు కాటకాలతో వలసల జిల్లాగా మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు.జిల్లాలో 3,04,943 ఎకరాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం కాగా, గత ఖరీఫ్‌లో 2,97,500 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నాట్లు పడ్డా, పంట పొట్ట దశకు వచ్చే సరికి వర్షాలు ఎత్తిగట్టేడంతో సుమారుగా లక్ష ఎకాల్లో వరి అప్పట్లో దెబ్బతిని పోయింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎస్‌.కోట, ఎల్‌.కోట, పార్వతీపురం, జామి మండలాలను కరువుగా ప్రకటించింది తప్పా, ఇంత వరకు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఆ తరువాత రబీలోనూ జిల్లాలో కరువు తాండవించింది. 26మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం పరిహారం మాత్రం ఇక్క రూపాయి కూడా చెల్లించలేదు. తాజాగా ఈ ఖరీప్‌లో మూడు లక్షల ఎకరాలకు కేవలం 1,25,032 ఎకరాల్లో వరినాట్లు పడినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ ఇందులో యద జల్లిన రైతులే సుమారుగా 50శాతం ఉన్నట్లు అంచనా. వర్షాలు లేకపోవడంతో ఉబాలు సాధ్యంకాక, యద జల్లినట్లు తెలుస్తుంది. ఈ పంట కూడా బతికే అవకాశాలు లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అధికారులు 41శాతం నాట్లు పడినట్లు చూపించినా, ఆకు ముదిరిపోయిన కారణంగా పెట్టిన పెట్టుబడులకు కూడా దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో ఈ ఏడాది 16 మండలాల్లో వర్షాబావం ఉన్నట్లు అధికారులు లెక్కలు చెప్పగా, వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా వర్షాబావ పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది 1.130.7మి.మీ సాదారణ వర్షపాతం కాగా, ఇప్పటి వరకు కేవలం 841.2మి.మీ మాత్రమే వర్షం కురిసింది. ప్రధానంగా ఖరీఫ్‌ అనుకూలమైన జూన్‌, జూలై, ఆగస్టులో 479.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటికి కేవలం 402.4 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్‌కు 77మి.మీ. వర్షం లోటులో ఉంది. దీంతో చాలా చోట్ల నాట్లు పడలే