సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మిస్సింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మిస్సింగ్

నెల్లూరు, సెప్టెంబర్ 13,(way2newstv.com)
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భయపడిపోతున్నారు. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోసం ఇప్పటికే వెతుకులాటప్రారంభమయింది. అమరావతి, నెల్లూరు, హైదరాబాద్ లలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలనిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9వ తేదీన పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని చెప్పి నోటీసులు అందుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదయిన సంగతి తెలిసిందే. 
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మిస్సింగ్

అయితే వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డికి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. తాను ఈనెల 9వ తేదీన హాజరవుతానని చెప్పిన సోమిరెడ్డి అప్పటి నుంచి కన్పించకుండా వెళ్లిపోయారు. దీంతోపోలీసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోసం అన్ని ప్రాంతాల్లో వెతుకుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా న్యాయస్థానంలో హాజరుకావాలని భావిస్తున్నట్లు సమాచారం.సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో 2.41 ఎకరాల భూమి రికార్డులు తారుమారు చేసి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కొందరుబాధితులు కోర్టునుఆశ్రయించారు. న్యాయస్థానం సోమిరెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, రాజకీయంగా తననుఇబ్బంది పెట్టడానికే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికిమధ్య ఎప్పటి నుంచో యుద్ధం నడుస్తోంది. గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డిపై సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కేసులు నమోదు చేయించారు. దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ పైమనీలాండరింగ్, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని కూడా ఆరోపణలు చేశారు. దీనిపై సోమిరెడ్డి కాకాణిపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలో కాకాణి తనపై పగపట్టారని సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. పాతకేసులను తిరగదోడి తనను జైలుకు పంపించాలని చూస్తున్నారని భావించి సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది