తిరుపతి, సెప్టెంబర్ 13, (way2newstv.com)
దివంగత టీడీపీ నాయకుడు… గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో పొలిటికల్ రచ్చ బజారుకెక్కింది. కుటుంబంలోని ఇద్దరు కుమారులు, భార్య కూడా రాజకీయంగా ఎవరికి వారు ఆధిపత్య ధోరణిని ప్రదర్శి స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు హయాంలోనూ ఎమ్మెల్సీ టికెట్ సహా ఎమ్మెల్యే టికెట్‌పై ముగ్గురూ ఘర్షణకు దిగారు. మాకంటే మాకే ఇవ్వాలనిపట్టుబట్టి రచ్చ చేసుకున్నారు. అయితే, ఎట్టకేలకు ఈ విషయంలో చంద్రబాబు సర్ది చెప్పి.. చక్కదిద్దారు. గాలి మృతితో ఎమ్మెల్సీ ఖాళీ ఏర్పడటంతో చంద్రబాబు కుమారుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలనిఅనుకున్నా వాళ్లిద్దరు పట్టుబట్టడంతో చివరకు మధ్యేమార్గంగా బాబు గాలి భార్య సరస్వతమ్మకే ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.అయితే, ఇప్పుడు మరోసారి ఈ కుటుంబంలో రాజకీయ దుమారం రేగింది.ఇటీవల ఎన్నికల్లో పెద్ద కుమారుడుకి చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
వైసీపీ గూటికి గాలి సోదరులు
అయితే, ఆయన జగన్ సునామీ నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. పార్టీపై ఇంత వ్యతిరేకత ఉన్నా భానుప్రకాశ్ నాయుడు రోజాచేతిలో కేవలం 2500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో అన్నకు సీటు ఇచ్చినందుకే రెండో కుమారుడు అన్న కోసం సరిగా పనిచేయలేదన్న ఆరోపణలు వచ్చాయి.ఇక, ఇప్పుడురెండో కుమారుడు తన దారి తాను చూసుకునేందుకురెడీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం తన తల్లి ఎమ్మెల్సీగా ఉండడంతో ఆమె అధికారాన్ని తానే చేతుల్లోకి తీసుకుని చక్రంతిప్పుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గాలి ముద్దుకృష్ణమ జీవించి ఉన్న సమయంలో పెద్ద కుమారుడు భాను ప్రకాశ్ నాయుడినిరాజకీయ వారసుడుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అన్నీ ఆలోచించి ఇటీవల ఎన్నికల్లో భానుకే టికెట్ ఇచ్చారు.అయితే, తనకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్న జగదీష్.. తన మామ, మాజీ మంత్రి, కర్ణాటక నేత కట్టా సుబ్రమణ్యం నాయుడు సూచనలతో టీడీపీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఘోరంగాఓడిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు గుర్రం ఎక్కే పరిస్థితి ఉండదని, ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే జగదీష్ వైసీపీ బాటలో నడిచేందుకు ముందుకుసాగుతున్నారని సమాచారం. జగదీష్ ప్రయత్నాలకు నగిరి ఎమ్మెల్యే రోజా కూడా చేయి అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. గాలి కుటుంబంలో రాజకీయంగా రెండు స్తంభాలాట ఖాయమనిఅంటున్నారు పరిశీలకులు.