పవన్ పై విజయసాయిరెడ్డి ఫైర్

హైద్రాబాద్, సెప్టెంబర్ 5  (way2newstv.com)
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని, టీడీపీ ప్లాన్‌లో భాగంగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఎప్పటికీ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది బహిరంగ రహస్యమేనన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్క మాట మాట్లాడని పవన్.. ఇప్పుడు చంద్రబాబు గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు ఆలోచించుకుని చేయాలని పవన్‌కు విజయసాయి హితవు పలికారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. 
పవన్ పై విజయసాయిరెడ్డి ఫైర్

కొత్త నిర్ణయాలు ప్రజల డబ్బును ఆదా చేయడంతో పాటు దేశంలో పారదర్శకత పెంపునకు దోహదం చేస్తాయన్నారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. ముందూ వెనుకా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్నారు. ఇసుక విధానంపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారంటూ విజయసాయి మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే వారికి ప్రజలకు మేలు చేసే నూతన ఇసుక విధానం నచ్చట్లేదని విమర్శించారు. ఇసుక కొరత అంటూ ఆందోళనలు చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇటీవల రాజధాని ప్రాంతంతో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌, మంత్రి బొత్సను టార్గెట్ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్క మాట మాట్లాడని పవన్.. ఇప్పుడు టీడీపీ ప్లాన్‌లో భాగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. ప్యాకేజీ ఆర్టిస్ట్ మళ్లీ వచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Previous Post Next Post