అమ్మఒడి పథకానికి కసరత్తు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మఒడి పథకానికి కసరత్తు

విద్యార్థుల వివరాలు సేకరిస్తున్న అధికారులు
గుంటూరు, అక్టోబరు 5, (way2newstv.com)
 నిరక్షరాస్యతను తగ్గించే లక్ష్యంగా రూపొందించిన అమ్మవొడి పథకం అమలుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో చదవే విద్యార్థుల తల్లులకు అమ్మవొడి పథకం ద్వారా ఏటా రూ. 15 వేల ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించారు. దీనిపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోయినా విద్యార్థులు, వారి తల్లుల వివరాలు సేకరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాశాఖ అధికారులు వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. తొలుత ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో చదివే విద్యార్థుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థి పుట్టిన తేదీ దృవపత్రం, స్టడీ సర్టిఫికెట్‌, తెల్ల రేషన్‌ కార్డు, తల్లి బ్యాంకు ఖాతాతో పాటు తల్లి యొక్క ఆధార్‌ కార్డుల వివరాలు సేకరించాలని మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవానీ సూచించారు.
అమ్మఒడి పథకానికి కసరత్తు

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఆధార్‌ అనుసంధానం చేస్తున్నారు. దీని ప్రకారం 2018-19లో 6.24 లక్షల మంది విద్యార్థులు ఆధార్‌తో అనుసంధానం అయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో 3,32,668 మంది విద్యార్థులు ఉండగా ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 3,50,746 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తంగా గత ఏడాది కన్నా 58 వేల మంది విద్యార్థులు పెరిగారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు 60 వేల వరకు పెరిగిందని అంచనా. ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా రూ.15 వేలు మాత్రమే చెల్లించడం వల్ల విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేదని తల్లుల వివరాలు మాత్రమే ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించి దాదాపు రెండు లక్షల మందికి మాత్రమే అమ్మవొడి పథకం వర్తించే అవకాశం ఉందని తెలిసింది. చెబుతున్నారు. అయితే ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు ఇంకా అధికారికంగా సేకరించడం లేదు. ప్రయివేటు పాఠశాలల నుంచి లక్షన్నర మంది ఉండే అవకాశం ఉందని జిల్లా మొత్తం మీద 3.50 లక్షల మంది తల్లులకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. అయితే గ్రామ వాలంటర్ల ద్వారా ఈవివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. పలు సామాజిక వర్గాల వారికి అందుతున్న ఉపకార వేతనాల వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారని తెలిసింది. ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నవారి వివరాలు కూడా కొన్ని యజమాన్యాలు సేకరిస్తున్నాయి. నవంబరు ఒకటో తేదీ లోగా ఎంతమంది విద్యార్థులు ఉంటారన్నదీ ఒక అంచనాకు వచ్చిన తరువాత దీనిని బటి ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల తల్లులకు కూడా ఎంత మేరకు అమలు చేయాలి.ఇందుకు రూపొందించాల్సిన మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. అమ్మవొడి ఇంకా మార్గదర్శకాలు రాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌ఎస్‌.గంగా భవానీ తెలిపారు. అయితే ముందస్తుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే సేకరిస్తున్నామని మార్గదర్శకాలు వచ్చిన తరువాత ప్రయివేటు పాఠశాలలపై దృష్టి సారిస్తామని ఆమె చెప్పారు.