హైద్రాబాద్, అక్టోబరు 4, (way2newstv.com)
తెలంగాణలో ఇప్పుడు ప్రజల చూపంతా ఒకటే వైపు ఉంది... రాష్ట్రంలోని ప్రజానీకం చర్చంతా ఆ నియోజకవర్గం పైనే... అంతగా రాష్ట్ర ప్రజలంతా ఆ నియోజకవర్గం వైపే ఎందుకు చూస్తున్నట్లు.. ఆ నియోజకవర్గం గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు.. ఇంతకు ఏ నియోజకవర్గం.. అంత ప్రత్యేకత ఏమీటి.. అనుకుంటున్నారా.. అది పూర్వ నల్లగొండ జిల్లాహుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికంటే ఆశామాషీ ఉప ఎన్నిక కాదు.. అది పోరు.. కాదు కాదు.. ఓ యుద్ధమే.. ఇంతకు అంతయుద్దం జరుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఉత్తమ్ ఫ్యూచర్ డిసైడ్ చేసే హూజూర్ నగర్
అయితే ఈ యుద్ధంలో గెలుపెవరిది.. ఓటమెవరిది... అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నా ఫలితంమాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది.హుజూర్‌నగర్ కు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అందుకే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పీసీసీఅధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి, అధికార టీఆర్ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో నిలిచారు. అయితే ఇక్కడ పోటీ ద్విముఖమే అని తేలిపోతుండగా, బీజేపీ,టీడీపీ, వైసీపీ కూడా బరిలో నిలిచాయి. ఎన్ని పార్టీలు నిలిచినా ఎందరు బరిలో ఉన్నా చివరికి పోటీ అధికార టీఆర్ఎస్. కాంగ్రెస్ నడుమ అన్నది సుస్పష్టం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పోరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రెపరెండం లాంటిదే.గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కేవలం 7 వేలఓట్లతోనే గట్టెక్కారు. ఇప్పుడు తన భార్యను ఈ ఎన్నికల్లో గెలిపించుకోకపోతే ఉత్తమ్ కుమార్ కాస్త ఉత్తర కుమారుడిగానే మిగిలిపోతారనే అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కాంగ్రెస్గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఉంటారు.. ఒకవేళ ఓడిపోతే పీసీసీ అధ్యక్ష పదవి హుష్‌కాకీ కావడం ఖాయం. అంటే పీసీసీ అధ్యక్షుడికి ఈ ఎన్నిక చాలాకీలకం. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఇక్కడ నల్లేరుపై నడకే అంటున్నాయి సర్వేలు. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి తక్కువ ఓట్లతోఓడిపోయాడు.ఇప్పుడు ఈ ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు టీఆర్ఎస్ శ్రేణులు గల్లీకో ఎమ్మెల్యే ఇన్‌చార్జీగా ఉండే పరిస్థితి ఉంది. అసలే అధికార పార్టీ..ఇంకేముంది.. ప్రజలు అధికార పార్టీకి ఓట్లేస్తే అభివృద్ధికి తోడు వ్యక్తిగత సమస్యలు తీరుతాయి.. లేకుంటే ఇక అంతే సంగతులు అన్న విషయం తెలిసిందే... మంచైనా చెడైనా అధికారపార్టీకి ఓట్లేయాలే అనే ఆలోచన ఇక్కడ ప్రజలు చేస్తున్నారట.. ఇక బీజేపీ ఇక్కడ గెలిచే సత్తా ఎలాగు లేదు కానీ, తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టే పార్టీగా అవతరించాలనిచూస్తోంది.ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధం కావడమా.. లేక ఓటు బ్యాంక్‌ను పెంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇవ్వడమా అనేది తేలిపోతుంది. ఇక ఏదేమైనా ఈఎన్నికతో పెద్దగా లాభమైనా నష్టమైనా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికే. ఎందుకంటే టీఆర్ఎస్ గెలిస్తే అధికార పార్టీకి తిరుగులేదని అంటారు.. ఓడితే పెద్దగా పోయేదేమీ లేదు..కనుక ఇప్పుడు ఈ ఎన్నిక తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికే కీలకం..!